ప్రతి ఒక్క ప్రజా సమస్యను పరిష్కరిస్తాము : కమిషనర్ నారపురెడ్డి మౌర్య ఐఏఎస్
,
తిరుపతి నగరపాలక సంస్థ:
తిరుపతి నగరంలో నెలకొన్న సమస్యలపై, ప్రజల నుండి వస్తున్న ప్రతి ఒక్క సమస్యను పరిశీలించి పరిష్కరిస్తామని పిర్యాధులు, అర్జీలు ఇచ్చేందుకు వచ్చిన ప్రజలనుద్దేశించి తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ నారపురెడ్డి మౌర్య ఐఏఎస్ అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో మీ కోసం – ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కమిషనర్ నారపురెడ్డి మౌర్య ప్రజల నుండి పిర్యాధులను, వినతులను స్వీకరించారు. కమిషనర్ ని కలిసిన డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ మాట్లాడుతూ నగరంలో చాలా ప్రదేశాల్లో అనుమతులు లేని ప్లెక్సిలు రోజులు తరబడి వున్నాయని, అదేవిధంగా రహదారులపై పడిన గుంతలను ప్యాచ్ వర్కులు చేసే మునిసిపల్ సిబ్బందికి వాహనాలు సమకూర్చాలని, మరికొన్ని సమస్యలను ప్రస్థావించగా, కమిషనర్ స్పందిస్తూ పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. అదేవిధంగా స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు ఎస్.కె.బాబు, నరసింహాచారి, కార్పొరేటర్లు కోటూరి ఆంజినేయులు, దొడ్డారెడ్డి ప్రవళ్ళికా రెడ్డి, నరేంధ్రనాధ్, బోకం అనీల్, అన్నా అనీత యాదవ్, దూది శివకుమారి తదితరులు కమిషనర్ ని కలిసి తమ పరిధిలోని సమస్యలను పరిష్కరించాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజల నుండి వచ్చిన పిర్యాధులను, వినతులను కమిషనర్ స్వీకరిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, అధికారులతో చర్చించి, సమస్యలను పరిశీలించి త్వరగా ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామి ఇవ్వడం జరిగింది. ప్రధాన సమస్యల్లో శ్రీనివాస నగర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయాలని, లీలామహాల్ దగ్గరున్న చేపల మార్కెట్టును మార్చాలని, హరిచంద్ర శ్మశానవాటికలో శవ దహనాల వలన కాలుష్యం ఏర్పడుతున్నదని, అశోక్ నగర్, అబ్బన్నా కాలనీలోని కాలువల్లో సీల్ట్ తొలగించాలని, పద్మావతి పార్క్ నందు సౌకర్యాలు కల్పించాలని అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో రోడ్లు పాడైపోయాయని, కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజి సమస్యలపై వచ్చిన పిర్యాధులను పరిశీలించి పరిష్కరిస్తామని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ నారపురెడ్డి మౌర్య ఐఏఎస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ తిరుమాలిక మోహన్, హెల్త్ ఆఫిసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, మునిసిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్, వెంకట్రామిరెడ్డి, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, కె.ఎల్.వర్మ, డిప్యూటీ సిటీ ప్లానర్ శ్రీనివాసులు రెడ్డి, ఫైర్ ఆఫిసర్ శ్రీనివాసరావు, వెటర్నరీ ఆఫిసర్ నాగేంధ్ర రెడ్డి, మేనేజర్ చిట్టిబాబు, డిఈలు, సూపర్డెంట్లు, సూపర్ వైజర్లు తదితర అధికారులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్క ప్రజా సమస్యను పరిష్కరిస్తాము : కమిషనర్ నారపురెడ్డి మౌర్య ఐఏఎస్
Related Posts
ప్రభుత్వం పీవీ సింధుకు కేటాయించిన 2 ఎకరాల స్థలంపై వివాదం
TEJA NEWS ప్రభుత్వం పీవీ సింధుకు కేటాయించిన 2 ఎకరాల స్థలంపై వివాదం ప్రభుత్వం పీవీ సింధుకు కేటాయించిన 2 ఎకరాల స్థలంపై వివాదంAP: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీసీ సింధుకు గత ప్రభుత్వం విశాఖ జిల్లాలో కేటాయించిన రెండు ఎకరాల స్థలం…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్ గా రిటైర్డ్ ఐఏఎస్
TEJA NEWS ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్ గా రిటైర్డ్ ఐఏఎస్ (1984) అనిల్ చంద్ర పునీతను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. TEJA NEWS