TEJA NEWS

మేమంతా సిద్ధం యాత్ర చివరి రోజున శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గంలోని అక్కివలస స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన పలువురు ముఖ్య నేతలు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు.

  • విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ మాజీ మంత్రి పెద్దింటి జగన్ మోహన్ రావు, ఆయన కుమారుడు పెద్దింటి రామస్వామి నాయుడు వైఎస్ఆర్సీపీలో చేరారు.
  • పార్వతీపురం నియోజక వర్గానికి చెందిన ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్‌ మాజీ సభ్యురాలు, టీడీపీ సీనియర్‌ నేత కొయ్యన శ్రీవాణి వైఎస్ఆర్సీపీలో చేరారు.
  • పలాస నియోజకవర్గ కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి, ఆమె కుమార్తె కొర్ల శిరీష వైఎస్ఆర్సీపీలో చేరారు.
  • పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మాజీ జెడ్పీటీసీ లోలుగు లక్ష్మణరావు వైఎస్ఆర్సీపీలో చేరారు.
  • ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం ఎంపీటీసీ మజ్జి గౌరి, టీడీపీ ఉపాధ్యక్షుడు మజ్జి రమేశ్‌ వైఎస్ఆర్సీపీలో చేరారు.
  • ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం మాజీ ఎంపీపీ గొర్లి విజయకుమార్‌, సీనియర్‌ నాయకుడు రామారావు వైఎస్ఆర్సీపీలో చేరారు.
  • చీపురుపల్లి నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ అధికార ప్రతినిధి రేగిడి లక్ష్మణరావు వైఎస్ఆర్సీపీలో చేరారు.
  • రాజాం నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ సభ్యుడు డి.నాగేశ్వరరావు వైఎస్ఆర్సీపీలో చేరారు.

TEJA NEWS