మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన అవినీతి, అక్రమాలపై విచారణ చేపిస్తాం

మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన అవినీతి, అక్రమాలపై విచారణ చేపిస్తాం

TEJA NEWS

బిఆర్ ఎస్ పార్టీ నాయకులు ఆక్రమించిన భూములను వెలికితీసి పేదలకు పంచుతాము
పదేళ్ల పాలనలో బిఆర్ ఎస్ పార్టీ నాయకుల భూకబ్జాలు, అక్రమాలు, అవినీతి ని బయటపెడతాం*
పార్లమెంటు ఎన్నికలలో మెజారిటీ రాకపోతే జగదీష్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి*
కాంగ్రెస్ పార్టీ పోలింగ్ బూత్ ఏజెంట్ లు, నియోజకవర్గం ముఖ్య నాయకుల సమావేశం లో మాజీ మంత్రి, నియోజకవర్గం ఇంఛార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి ప్రకటన

సూర్యాపేట నియోజకవర్గం లో మాజి మంత్రి జగదీష్ రెడ్డి చేసిన అవినీతి, అక్రమాలు బయటకు తీస్తామని, బిఆర్ ఎస్ పార్టీ నాయకులు గత పదేళ్ల పాలనలో చేసిన భూ కబ్జాలను వెలికితీసి, ఆ భూములను పేదలకు పంచుతామని మాజీ మంత్రి, సూర్యాపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ పోలింగ్ బూత్ ఏజెంట్ లు, ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత పదేళ్ల బిఆర్ ఎస్ పాలనలో పేదలను భయపెట్టి , పేదల భూములను బిఆర్ ఎస్ పార్టీ నాయకులు ఆక్రమించారని, వాటిపై విచారణ జరిపి, పేదలకు భూములను పంచుతామని అన్నారు. విద్యుత్ శాఖ మంత్రిగా జిల్లా లకు జగదీష్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏమి లేదని, తాను ఎమ్మెల్యే గా పనిచేసిన సమయంలో 400kv, 220 kV, 132 kV సబ్ స్టేషను లను తీసుకుని వచ్చానని, 33 కెవి సబ్ స్టేషను లను 14మంజూరు చేశానని ఆయన అన్నారు. తరువాత అధికారంలోకి వచ్చిన జగదీష్ రెడ్డి వాటిని ఆయన చేసిన అభివృద్ధి గా చెప్పుకున్నారని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా వున్న సమయంలో ఎస్ ఆర్ ఎస్ పి రెండవ దశ పూర్తి చేసి సూర్యాపేట కు గోదావరి జలాలు తీసుకుని వస్తే ఆ తరువాత ఆనీళ్లకు జగదీష్ రెడ్డి పసుపు, కుంకుమ చల్లి పూజలు చేశారని అన్నారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా వున్న జానారెడ్డిని ఒప్పించి పాలేరు జలాలు సూర్యాపేట కు తీసుకుని రావడానికి కాలువలు తవ్వితే వాటిని బిఆర్ ఎస్ ప్రభుత్వంలో మిషన్ భగీరథ పధకంగా ప్రచారం చేసుకున్నారని అన్నారు. తన పాలనలో సూర్యాపేట లో విశాలమైన ప్రదేశంలో నూతన వ్యవసాయ మార్కెట్ నిర్మాణం చేశానని అన్నారు. ఐదు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తనకు టిక్కెట్ ఆలస్యంగా రావడం వలన సమయం లేకపోవడం వలన ప్రణాళిక ప్రకారం ప్రచారం చేయలేక పోయానని అన్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేశారని అన్నారు. పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి కి అత్యధిక మెజారిటీ తీసుకుని వస్తామని అన్నారు. సూర్యాపేట పట్టణంతో పాటు ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేశారని, బిఆర్ ఎస్ పార్టీ కి ఏజెంట్ లు లేరని , బిఆర్ ఎస్ నాయకులు ఎక్కడా కూడా కనిపించలేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపి అభ్యర్థి విజయం కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదములు తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత గ్రామాలలో ఇందిరమ్మ కమిటీలు వేసి, వారి ద్వారా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం లబ్ధిదారులను ఎంపిక చేస్తామని అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా కు చెందిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట రెడ్డి లను సూర్యాపేట నియోజకవర్గానికి తీసుకుని వచ్చి అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేస్తామని అన్నారు. గత పదేళ్ల కాలంలో ఏ గ్రామంలో కూడ రోడ్లు వేయలేదని, గ్రామాలకు వచ్చే బిఆర్ ఎస్ పార్టీ నాయకులను నిలదీసి ప్రశ్నించాలని అన్నారు. పార్లమెంటు ఎన్నికలలో నియోజకవర్గం నుండి మొత్తం 2,44,116 మంది ఓటర్లకు గాను
1,78,378 మంది ఓటింగ్ లో పాల్గొన్నారని, మొత్తం ఓట్లలో 73% మంది ఓట్లు వేశారని , గతంలో కంటె ఎక్కువగా పోలింగ్ జరిగిందని ఆయన అన్నారు.
ఈ సమావేశంలో ఎఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ రెడ్డి మాట్లాడుతూ సూర్యాపేట నియోజకవర్గం లోని ప్రతి గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుని , వాటిని పరిష్కారం చేయడానికి కృషి చేస్తానని అన్నారు. పెన్ పహాడ్ మండల ప్రజలు రెండు లిఫ్టులు కావాలని అడిగారని, ఇరిగేషన్ అధికారులను తీసుకుని వెళ్లి సమీక్ష చేస్తామని, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో మాట్లాడి నిధులు మంజూరు చేస్తామని అన్నారు. పార్లమెంటు ఎన్నికలో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణతో పనిచేయడం వలన పార్టీకి ప్రతి చోటా మెజారిటీ వస్తున్నట్లు తెలుస్తుందని అన్నారు. తాను ప్రతి కార్యకర్తకు అందుబాటులో వుండి పార్టి అభివృద్ధి కోసం పనిచేస్తానని అన్నారు. రాబోయే పంచాయతి ఎన్నికలు, ఎంపిటిసి, జెడ్పిటిసి, సహకార సంఘాల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ప్రతి గ్రామంలో విజయం సాధించాలని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలలో బిఫామ్ ఇచ్చిన నాయకులను ఇంఛార్జ్ లుగా ప్రకటించారని, కాబట్టి సూర్యాపేట లో రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఇంఛార్జ్ గా పనిచేస్తున్నారని అన్నారు.
ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకులు కొప్పుల వేణారెడ్డి మాట్లాడుతూ రాంరెడ్డి దామోదర్ రెడ్డి ప్రజల కోసం పనిచేసే నిజమైన నాయకుడని అన్నారు. తుంగతుర్తి లో గ్రామగ్రామన కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేశారని, ఆనాడు కమ్యూనిస్టు పార్టీ ఆధిపత్యం వుండే కాలంలో, ఫ్యాక్షన్ రాజకీయాలలో పార్టీ కార్యకర్తలకు దామోదర్ రెడ్డి అండగా నిలచారని, పార్టీని కాపాడుకున్నారని అన్నారు. ఆనాటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వకపొవడం వలన కార్యకర్తల అభిష్టం మేరకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలిచారని అన్నారు. తెలుగుదేశం పార్టీలో చేరితే మంత్రి పదవి ఇస్తామని ఎన్టీఆర్ ఆహ్వానించినప్పటికి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ని విడిచిపెట్టి వెళ్లలేదని అన్నారు. తాను ముందు నిలబడి పార్టీ ని నడిపించే నాయకుడు దామోదర్ రెడ్డి అని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వరరావు, పిసిసి ప్రతినిధి అన్నెపర్తి జ్ఞానసుందర్, మాజి ఎమ్మెల్యే దోసపాటి గోపాల్, నాయకులు గోదాల రంగారెడ్డి, పోతు భాస్కర్, పట్టణ అధ్యక్షులు అంజద్ ఆలి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్, చింతమల్ల రమేష్, వీరన్న నాయక్, కోతి గోపాల్ రెడ్డి, కొండపల్లి దిలీప్ రెడ్డి, అబ్దుల్ రహీం, పలువురు కౌన్సిలర్ లు, నాయకులు పాల్గొన్నారు.
……..

Print Friendly, PDF & Email

TEJA NEWS