TEJA NEWS

శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో జరిగిన అన్ని విభాగల అధికారుల తో జరిగిన సమీక్షా సమావేశంలో జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి , అడిషనల్ డీసీపీ జయరాం రెడ్డి , డీసీలు ముకుంద రెడ్డి , మోహన్ రెడ్డి , సురేష్ , శ్రీమతి సుల్తానా , GHMC ఇంజనీరింగ్ విభాగం, జలమండలి,టౌన్ ప్లానింగ్, రెవెన్యూ పోలీస్,ట్రాఫిక్, అర్బన్ బయో డైవర్సిటీ, విద్యుత్,స్ట్రీట్ లైట్స్ మరియు ఇతర విభాగం అధికారులతో కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలు మరియు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై సమీక్షా సమావేశం నిర్వహించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ అన్ని విభాగల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, సమిష్టి కృషి తో శేరిలింగంపల్లి నియోజకవర్గం ను అన్ని రంగాలలో అభివృద్ధి కి ప్రతి ఒక్కరు కృషి చేయాలని శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలు మరియు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై చర్చించడం జరిగింది . ప్రజల సౌకర్యార్థం ట్రాఫిక్ రహిత సమాజం కోసం ట్రాఫిక్ మెరుగుదల పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని, ప్రత్యేక డ్రైవ్ పెట్టి ఫూట్ పాత్ ల అక్రమాలను తొలగించాలని, ఫూట్ ఫాత్ ఆక్రమించిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని, బాటసారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడలని , ప్రజలకు మెరుగైన సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.

ముఖ్య కూడలి(జంక్షన్)లను సుందరవణంగా తీర్చిదిద్దుతామని , పెండింగ్ లో ఉన్న పనులు త్వరితగతిన పూర్తయ్యేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని, అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడలని , అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని,అవసరమైతే ముఖ్యమంత్రివర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లి అధిక మొత్తంలో నిధులు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని, పనులలో వేగం పెంచాలని సకాలంలో నిధులు మంజూరు అయ్యేలా చూడలని , అభివృద్ధి పనులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడలని,

అదేవిధంగా మంజీర పైప్ లైన్ రోడ్డు నిర్మాణం పనులు వెంటనే చేపట్టాలని, శ్రీదేవి థియేటర్ నుండి అమిన్ పూర్ రోడ్డు విస్తరణ పనులు త్వరితగతిన చేపట్టాలని, గంగారాం హనుమాన్ దేవాలయం ప్రధాన రహాదారి నుండి అపర్ణ వరకు లింక్ రోడ్డు పనులు త్వరితగతిన ప్రారంభంయ్యేలా చూడలాని, ప్రజఅవసరాల దృష్ట్యా లింక్ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా చూడలని,కూడలి ల సుందరి కరణ చేపట్టాలని, చెరువుల సుందరికరణ, పార్క్ లు అభివృద్ధి చేపట్టాలని, రోడ్ల మరమ్మతులు చేపట్టాలని, అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజి పడకూడదు అని, అధికారులతో చర్చించి తక్షణమే చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు కు కృషి చేయాలని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.

మంచి నీటి సమస్యలు తలెత్తకుండా చూడలని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడలని, మురుగు నీటి వ్యవస్థ పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ఎక్కడ మురుగు నీరు రోడ్ల ప్రవాహం లేకుండా చూడలని , డ్రైనేజి సమస్యలు తలెత్తిన వెంటనే పరిష్కారం అయ్యేలా చూడలని , కాలనీలలో మెరుగైన జీవన ప్రమాణాలు చేపట్టాలని జలమండలి అధికారులకు తెలియచేసారు.

వర్షాల వలన దెబ్బ తిన్న రోడ్ల ను వెంటనె పునరుద్ధరించాలని , రోడ్ల మరమ్మత్తులు చేపట్టాలని, కాలనీ లలో నెలకొన్న విద్యుత్ సమస్యల పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, అవసరమున్న చోట విద్యుత్ స్తంభాల స్దాన భ్రంశం పై చర్యలను చేపట్టాలని, వీధి దీపాలు సక్రమంగా వెలిగేలా చూడలని అధికారులకు PAC చైర్మన్ గాంధీ గారు తెలియచేసారు

ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్, జలమండలి, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, పోలీస్, ట్రాఫిక్, అర్బన్ బయో డైవర్సిటీ, విద్యుత్,, స్ట్రీట్ లైట్స్ విభాగం ఉన్నత అధికారులు ,తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS