TEJA NEWS

మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై మహిళా కమిషన్ సీరియస్

  • పలు ఘటనలపై సూమోటో కేసుల విచారణకు స్వీకారం
  • పోలీసు ఉన్నతాధికారులకు కమిషన్ లేఖలు

అమరావతి:
రాష్ట్రంలో పలుచోట్ల మహిళలపై జరిగిన అకృత్యాలపై మహిళా కమిషన్ సీరియస్ గా స్పందించింది. ఈ మేరకు కమిషన్ చైర్ పర్సన్ శ్రీమతి గజ్జల వెంకట లక్ష్మి మీడియాలో ప్రచురితమైన పలు ఘటనలను కమిషన్ సూమోటోగా స్వీకరించి విచారించాలని నిర్ణయం తీసుకున్నారు. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం చేజెర్లలో జనసేన నేత వేధింపులకు తాళలేక కృష్ణవేణి అనే మహిళ బలవన్మరణానికి సంబంధించిన ఘటనపై తక్షణమే చర్యలు చేపట్టి నివేదిక పంపాలని పల్నాడు ఎస్పీని కోరుతూ లేఖ పంపారు. అదేవిధంగా ఒంగోలు జిల్లా మోటుమాల కేజీబీవీలో ఇంటర్ బాలిక ప్రసవంపై కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకట లక్ష్మి ఆరా తీశారు. స్థానిక మహిళా శిశు సంక్షేమ అధికారులతో పాటు జిల్లా ఎస్పీలను లేఖల ద్వారా ప్రాథమిక విచారణ నివేదికలు అడిగారు. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి గ్రామానికి చెందిన అయిలూరి సంతోష లక్ష్మి టీడీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని కోరడం… స్థానిక పోలీసులు పట్టించుకోని వైనంపై పత్రికల్లో వచ్చిక కథనంపై కూడా మహిళా కమిషన్ దృష్టి పెట్టింది. చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలానికి చెందిన ఓ ఉన్మాది కన్న కూతురిని ఛార్జింగ్ వైర్ తో గొంతునులిమి చంపిన వైనంపై కూడా మహిళా కమిషన్ సీరియస్ గా స్పందించి చిత్తూరు ఎస్పీకి దర్యాప్తు నివేదికను పంపాలని లేఖలో కోరారు. వరుస సంఘటనలు చూస్తే మహిళలపై, బాలికలపై హత్యలు, హత్యాచారాలు విపరీతంగా జరుగుతున్నాయి. ఈ దాడులను ఆపేలాగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి కోరారు*.


TEJA NEWS