ప్రపంచ తెలుగు సాహితీ – కళా జాతర.
ముఖ్య అతిథులుగా :- ఎమ్. ఎస్. ఎస్. సాయిరామ్.
అంతర్జాతీయ తెలుగు సాహిత్య సాంస్కృతిక అకాడమీ కళావేదిక స్వయక్త ఆధ్వర్యంలో డా.కత్తిమండ ప్రతాప్ సారద్యంలో ఈ నెల అక్టోబర్ 19,20 తేదీల్లో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో బుద్దాల కన్వెన్షన్స్ హాలునందు 24 గంటల పాటు నిర్విరామంగా జరిగే ప్రపంచ తెలుగు సాహిత్య కళ జాతర వరల్డ్ రికార్డులో పాల్గొనుటకు కవి, రచయిత, గాయకులు, సామాజికవేత్త ఎం.ఎస్. ఎస్. సాయిరాం కి ఆహ్వానం అందినది. పరవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గా పని చేయుచున్నారు.గతంలో ఈయన అనేక సామాజిక రచనలు, చేయడం జరిగినది. వివిధ సాహితీ ప్రక్రియలలో సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం జరిగినది.ఈ సందర్భంగా వైద్యాధికారులు డాక్టర్ హారిక, డాక్టర్. జయశ్రీ కరిష్మా ఆప్తాల్మిక్ ఆఫీసర్ ఆర్.వెంకట్రావు సీనియర్ అసిస్టెంట్ ఆనంద కుమార్, వైద్య సిబ్బంది తదితరులు అభినందనలు తెలియజేశారు.