ఏపీలో వైసీపీ అధికారంలోకి రాబోతుంది’.. సజ్జల రామకృష్ణా రెడ్డి

ఏపీలో వైసీపీ అధికారంలోకి రాబోతుంది’.. సజ్జల రామకృష్ణా రెడ్డి

TEJA NEWS

వైసీపీ అధికారంలోకి రాబోతుందన్నారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ, జనసేన, బీజేపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2014లో ఇదే కూటమి జతకట్టిందని గుర్తు చేశారు. కాపు సామాజిక వర్గం ఓట్లను గంపగుత్తగా చంద్రబాబుకు వేయించాలని పవన్ కళ్యాణ్ విశ్వప్రయత్నం చేస్తున్నారన్నారు. చంద్రబాబు కోసమే పవన్ తాపత్రయపడుతున్నారని చురకలంటించారు.

జనసేనకు ఇచ్చింది 21 సీట్లే అని గుర్తు చేశారు. జనసేన, బీజేపీ కూటమిలో అందరూ చంద్రబాబు మనుషులే అని విమర్శించారు. ఎదుటివారిపై నిందలు వేయడం చంద్రబాబుకు అలవాటన్నారు. చంద్రబాబు డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.

2014లో ఇదే కూటమిపేరుతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. చంద్రబాబు, పవన్ లకు వైఎస్ఆర్సీపీ విజయం ఖాయం అని తెలిసి ఫ్రస్టేషన్ మొదలైందని సెటైర్లు వేశారు. రాజకీయాల్లో విమర్శలు ఎన్నైనా చేయవచ్చని.. అయితే వాటికి ఆధారాలు చూపించాలన్నారు. రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసిందెవరని నిలదీశారు. అప్పుడు చంద్రబాబు ప్రజలను నమ్మించి ఎలా మోసం చేశారో ప్రజలందరికీ తెలుసన్నారు.

2024లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాబోతుందని వారికి కోపం అన్నారు. చంద్రబాబు నాటకంలో పవన్ కళ్యాణ్ ది చిన్న పాత్రేనని చెప్పారు. సీఎం జగన్ అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందజేశారని చెప్పారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS