TEJA NEWS

తెలుగుదేశం పార్టీని గెలిపిద్దాం..

ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారుద్దాం.

వేగేశన నరేంద్ర వర్మ
బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్

బాపట్ల నియోజకవర్గములోని ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీని చేరువ చేయడమే లక్ష్యంగా బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ గారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటికి తెలుగుదేశం మీ మాటే – నా బాట,భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమం లో భాగంగా నేడు బాపట్ల మండలం నందిరాజు తోట గ్రామం మరియు పిట్లవానిపాలెం మండలం కోమలి,రెడ్డిపాలెం గ్రామాలలో తెలుగుదేశం పార్టీ నాయకులతో కలసి వెళ్లి తెలుగుదేశం పార్టీ విధి విధానాలు వివరిస్తూ మహిళలకు చీర, నిత్యావసర వస్తువులు తెచ్చుకునే సంచి, తన గురించి తెలియజేసే కరపత్రాన్ని అందజేసి ఆశీర్వదించమని కోరారు. అనంతరం భవిష్యత్ కు గ్యారంటీ పత్రాలలో వారి కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేసి భవిష్యత్తు గ్యారెంటీ సంక్షేమ పథకాలు గురుంచి వివరించిన బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ గారు.

ఈ సందర్భంగా నరేంద్ర వర్మ మాట్లాడుతూ…

తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చుకోవాలని ఆయన అన్నారు

రాష్ట్రంలో పేదలు నిరుపేదలుగా, యువత నిరుద్యోగులుగా మారారని అన్నారు

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే పూర్ టూ రిచ్ పథకం ద్వారా పేదలను రిచ్ గా చేసేందుకు ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే తల్లికి వందనం పథకంతో ఏడాదికి 15 వేల రూపాయలు తల్లి ఖాతాలో జమ చేయడం జరుగుతుందని అన్నారు

రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయుచున్నానని తనని ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS