
డీఎస్సీ అక్రమాల వల్ల బలి అయినా యువత
ఇది కూటమి ప్రభుత్వం కాదు కూలే ప్రభుత్వం
డీఎస్సీలో అక్రమాలకు పాల్పడిన మంత్రి నారా లోకేష్ ను వెంటనే రాజీనామా చేయాలి.
ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్.
ఇది కూటమి ప్రభుత్వం కాదని త్వరలో కూలిపోయే ప్రభుత్వమని ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ అన్నారు. డీఎస్సీ అక్రమాలపై కోవూరులో వైసీపీ నిర్వహిస్తున్న దీక్షలో మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, వైసిపి రాష్ట్ర కార్యదర్శి మహేందర్ రెడ్డి తో కలిసి వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ విస్మరించి అరాచక దాడులకు పాల్పడుతుందని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు సైతం క్షీణించేయని, మెగా డీఎస్సీ అనేది దగా డిఎస్సీ అని మెగా డీఎస్సీలో అవకతవకలకు పాల్పడి విద్యార్థులతో చలగాటమాడిన నారా లోకేష్ నువెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి యువతకు ఇస్తానని హామీ ఇచ్చి రాష్ట్ర యువతను నిలువనా ముంచారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా పాటిస్తూ ప్రతి ఒక్కరు అమలు చేశారు అన్నారు. ఇది ఆరంభం మాత్రమే అని నారా లోకేష్ రాజీనామా చేసే వరకు ఈ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయని అన్నారు. ఈ రిలే నిరాహార దీక్షలో యువత భారీ ఎత్తున పాల్గొంటున్నారు అన్నారు. ఈ కార్యక్రమంలో వీరి చలపతిరావు, కొండూరు అనిల్ బాబు, పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, శివుని నరసింహులు రెడ్డి, రామిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి, అత్తిపల్లి అనూప్ రెడ్డి, నలుబోలు సుబ్బారెడ్డి, సతీష్ రెడ్డి, షేక్. సాహుల్, నవీన్ రెడ్డి, శేషగిరిరావు, బుచ్చిరెడ్డిపాళెం వైసిపి మండల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.