TEJA NEWS

రైతులకు, ప్రజలకు సేవ చేసిన ఘనత వైఎస్ఆర్ కు దక్కుతుంది…

జయంతి సందర్భంగా నివాళులు ఆర్పించిన….

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆ మహానాయకుడికి నివాళులు అర్పించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర ప్రజాప్రతినిధులు, నేతలతో కలిసి పంజాగుట్టలోని వైఎస్సార్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.

అనంతరం మహాత్మ జ్యోతిరావ్ పూలే ప్రజాభవన్‌లో ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫోటో ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా వైఎస్సార్ రైతాంగానికి, పేదలకు చేసిన సేవలను ఈ సందర్భంగా సీఎం గుర్తుచేసుకున్నారు.

రైతులకు, ప్రజలకు సేవ చేసిన ఘనత వైఎస్ఆర్ కు దక్కుతుంది

TEJA NEWS