ప్రజలు మెచ్చిన నాయకుడు వై. ఎస్. ఆర్
నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజశేఖరరెడ్డి కి ఘన నివాళి
నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్,పార్టీ నాయకులు టి.కె. విశ్వేశ్వర్ రెడ్డి
రాజమహేంద్రవరం : ప్రజలు మెచ్చిన పాలన అందించిన నాయకుడు దివంగత నేత వై.యెస్. రాజశేఖర్ రెడ్డి అని రాజమండ్రి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ కొనియాడారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత కాంగ్రెస్ పార్టీ నాయకులు వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా స్థానిక పేపర్ మిల్ వద్ద నున్న విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ నాయకులు టి.కె. విశ్వేశ్వర్ రెడ్డి సహకారంతో పేదలకు రగ్గులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాలేపల్లి మాట్లాడుతూ సంక్షేమంటే రాజశేఖర్ రెడ్డే అనే విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేసిన గొప్ప నాయకుడన్నారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలనే ఆయన చిరకాల కోరిక రానున్న రోజుల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిజం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి అనేక మందికి ప్రాణధానం చేసిన మహా నేత మరణాన్ని జీర్ణించుకోలేక అనేక మృతి చెందిన విషయాన్ని గుర్తు చేసుకుని బాధను వ్యక్తం చేశారు. టి.కె విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పాద యాత్ర ద్వారా ప్రజల ఇబ్బందులను తెలుసుకుని ప్రజల.మెచ్చే పాలన అందించారన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా విద్యార్థుల జీవితాలు మార్చిన గొప్ప నాయకుడు వైఎస్ఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్లా షరీఫ్, బెజవాడ రంగ, డా. సుధాకర్, మార్టిన్ లూథర్, బత్తిన చందర్రావు, బండారు వెంకన్న, మహిళా నాయకురాలు శారద, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బిల్డర్ బాబీ తదితరులు పాల్గొని నివాళులర్పించారు.
ప్రజలు మెచ్చిన నాయకుడు వై. ఎస్. ఆర్
Related Posts
మాజీ మంత్రి పేట శాసనసభ్యులు
TEJA NEWS మాజీ మంత్రి పేట శాసనసభ్యులు ప్రత్తిపాటి బాటలో క్లస్టర్ ఇంచార్జ్ జంగా వినాయక రావు చిలకలూరిపేట పట్టణం వైయస్సార్ కాలనీలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త చాట్ల ప్రసాదరావు గత కొద్ది రోజులు క్రితం మరణించడం జరిగింది. ఆ వార్త…
తెలుగుదేశం పార్టీ నేత కొత్త సాంబశివరావు మరణం చాలా బాధాకరం
TEJA NEWS తెలుగుదేశం పార్టీ నేత కొత్త సాంబశివరావు మరణం చాలా బాధాకరం…పార్టీకి తీరని లోటు. మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు . వెలదికొత్తపాలెంలోని వారి స్వగృహంలో సాంబశివరావు సంతాప సభ…విగ్రహావిష్కరణ. ఎన్టీఆర్ జిల్లా, చందర్లపాడు(వెలదికొత్తపాలెం), తెలుగుదేశం పార్టీ సీనియర్…