TEJA NEWS

ఆంద్రప్రదేశ్ లో సమ్మెకు సై అంటున్న 108, 104 ఉద్యోగులు

ఆంధ్ర ప్రదేశ్ లో 108, 104 ఉద్యోగులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె బాట పడుతున్నారు. ఉద్యోగ భద్రత, ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రాధాన్యత లేకపోవటం, వేతానాలు సక్రమంగా చెల్లించక పోవటం తో ఈ సమ్మె చేస్తున్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు.

రాష్ట్రంలో 108 ఉద్యోగులు 2 వేలకు పైగా, 104 ఉద్యోగులు 1500 పైగా విధులు నిర్వహిస్తున్నారు.

ఐతే తమను ఆప్కాస్ లో చేరుస్తామని హామీ ఇచ్చి నెరవేర్చలేదని మండి పడుతున్నారు.ఈ సమ్మె పై ఆరోగ్య శాఖ అధికారులుకు నోటీసులు అందిస్తామని, రెండు వారాల తర్వాత కార్యాచరణ లోకి దిగుతామని హెచ్చరించారు.


TEJA NEWS