స్వచ్చందంగా బీజేపీ లో చేరిన 200 కుటుంబాలు

స్వచ్చందంగా బీజేపీ లో చేరిన 200 కుటుంబాలు

TEJA NEWS

-ఖమ్మం పార్లమెంట్ భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్ రావు

……

ఖమ్మం పార్లమెంట్ భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్ రావు ప్రచారంలో భాగంగా కల్లూరు మండలం, పడమటి లోకవరం, పుల్లయ్య బంజర గ్రామాలలో పర్యటించారు. పడమటి లోకవరం గ్రామానికి చెందిన 150 మంది మహిళలు, మరియు యువకులు నరేంద్రమోది చేసిన అభివృద్ధి, అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలు, వారికి దేశం ధర్మంపట్ల ఉన్న నిబద్దతకు ఆకర్షితులై వినోద్ రావు సమక్షంలో స్వచ్చందంగా బీజేపీ లో చేరారు. పుల్లయ్య బంజర గ్రామానికి చెందిన
పసుపులేటి సుబ్బారావు ఆధ్వర్యంలో 200 కుటుంబాలు వినోద్ రావు సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ తాండ్ర వినోద్ రావు ఎంపీగా గెలిచేవరకు అహర్నిశలు శ్రమించి వారి గెలుపులో భాగమవుతామన్నారు.
వినోద్ రావు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో భారతదేశం రామ రాజ్యం గా ఉండాలంటే కేవలం నరేంద్రమోది వల్లనే సాధ్యమవుతుందని అన్నారు.
అనంతరం కల్లూరు మండలంలో వీధి వీధినా ప్రచారం చేస్తూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తనని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు..

Print Friendly, PDF & Email

TEJA NEWS