TEJA NEWS

దిగ్విజయంగా ముగిసిన 35వరోజు ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం…గుడివాడ రూరల్ మండలంలో విస్తృతంగా పర్యటన

-ఉదయం మండలంలోని వలివర్తిపాడు గ్రామం…సాయంత్రం శేరివేల్పూరు, సిద్ధాంతం, దింటకూరు, చౌటపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే నాని…

-గ్రామ గ్రామాన నిరాజనాలతో ఎమ్మెల్యే కొడాలి నానికు ఘన స్వాగతం పలికిన ప్రజానీకం

-పేదలు..సామాన్య…మధ్య తరగతి ప్రజలు ఆత్మగౌరవంతో జీవించాలంటే…జగనన్నకు మద్దతుగా నిలవాలి…

-నిరంతరం మీకు అండగా ఉంటున్న సీఎం జగనన్నకు…ఈ ఎన్నికల్లో ఓటెయ్యాలి…

-జగన్ ను ఓడించాలని కూటమి….జనాన్ని గెలిపించాలని జగన్ పోరాడుతున్నారు..

గుడివాడ రూరల్ 01: ఎమ్మెల్యే కొడాలి నాని 35వరోజు ఎన్నికల ప్రచారం దిగ్విజయంగా ముగిసింది. ఉదయం గుడివాడ మండలంలోని వలివర్తిపాడు గ్రామం…సాయంత్రం శేరివేల్పూరు, సిద్ధాంతం, దింటకూరు, చౌటపల్లి గ్రామాల్లో ఎంఎల్ఏ కొడాలి నాని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వస్తున్న ఎమ్మెల్యే కొడాలి నానికు గ్రామ…గ్రామాన సెంటర్లో గజ మాలలతో వైఎస్ఆర్సిపి నాయకులు ఘన స్వాగతం పలికారు. . పార్టీ శ్రేణులు…. స్థానికులతో కలిసి ఎమ్మెల్యే నాని ఆయా గ్రామాల్లో గడపగడపకు ప్రచారాన్ని నిర్వహించారు. ప్రజలకు అభివాదాలు చేస్తూ ప్రచారాన్ని నిర్వహిస్తున్న ఎమ్మెల్యే కొడాలి నానికు, అడుగడుగునా మంగళ హారతులతో మహిళా సోదరీమణులు స్వాగతం పలుకగా,పూల మాలలతో ప్రజలు సత్కరించారు.ప్రచారంలో భాగంగా వార్డులోని దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఎమ్మెల్యే కొడాలి నాని…. క్రైస్తవ చర్చిల్లో నిర్వహించిన ప్రార్థనల్లో పాల్గొన్నారు. వైసిపి ప్రభుత్వం చేసిన మంచిని….. ఎమ్మెల్యే నాని చేసిన వ్యక్తిగత సహాయాన్ని గుర్తు చేసుకుంటు స్థానిక ప్రజానీకం ఎమ్మెల్యే కొడాలి నానికు వివిధ రూపాల్లో తమ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. వివిధ వర్గాల ప్రజానీకంతో మమేకమవుతు ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే నానీకు పూల వర్షాలు కురిపిస్తూ గజమాలలు వేస్తూ పార్టీ నాయకులు… అభిమానులు ఎమ్మెల్యే కొడాలి నానిపై తమకు ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు.

పలుచోట్ల ఆయా ప్రాంతాల పెద్దలు….నాయకులు… అభిమానులు…. ప్రజలు…. ఎమ్మెల్యే కొడాలి నానిను తమ ఇళ్లలోకి ఆహ్వానిస్తూ ఆత్మీయ ఆతిథ్యం ఇవ్వడమే కాక….. వివిధ రూపాల్లో ఆత్మీయ సత్కారాలు చేస్తున్నారు. ప్రచారం ఆసాంతం తీన్మార్ డప్పుల మధ్య…. టపాసులు కాలుస్తూ స్థానిక యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ టిడిపి గెలిచే అవకాశం లేదని టీడీపీ నాయకులకు కూడా తెలుసన్నారు. 600 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదేనని ఆయన విమర్శలు గుప్పించారు.గతంలో కేవలం 2 పేజీల మేనిఫెస్టో ఇచ్చి, అందులో 99 శాతం హామీలు అమలు చేశామని.. గతంలో ఉన్న 7 మెడికల్ కాలేజీలకు అదనంగా 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే కొడాలి నాని పేర్కొన్నారు. సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ హెల్త్ క్లినిక్స్ అభివృద్ధి కాదా అంటూ ప్రశ్నించారు. ఒక్క రూపాయి కూడా లంచానికి తావు లేకుండా సీఎం జగన్ పథకాలు అందిస్తున్నారన్నారు. గతంలో టీడీపీ జన్మభూమి కమిటీలు ఉండేవని.. వారికి కావాల్సిన వారికి మాత్రమే పథకాలు ఇచ్చే వారని ఆయన విమర్శించారు. ఈరోజు అలాంటి పరిస్థితి లేదన్నారు. ఎమ్మెల్యేగా నన్ను…. ఎంపీగా సింహాద్రి చంద్రశేఖర్ ను గెలిపించాలని ఎమ్మెల్యే నాని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో కృష్ణాజిల్లా యువజన విభాగ అధ్యక్షుడు మెరుగుమాల కాళీ, గుడివాడ రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్, గుడివాడ మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ మట్ట నాగమణి జాన్ విక్టర్, జడ్పిటిసి గొళ్ల రామకృష్ణ, ఎంపీపీ గద్దె పుష్పరాణి, వైస్ ఎంపీపీ బట్టు నాగమల్లేశ్వరి, ఎంపీటీసీలు సింగవరపు ఝాన్సీ రాణి, గుడివాడ మండల సచివాలయాల కన్వీనర్ కారే జోసెఫ్, సర్పంచులు మేడేపల్లి ప్రభాకర్ రావు, ఇస్సా కృష్ణమూర్తి, వెలగలేటి రమ్య, వైస్ సర్పంచులు పల్లపోతు శ్రీనివాసరావు,శేరివేల్పూరు, సిద్ధాంతం, దింటకూరు, చౌటపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేడేపల్లి రమేష్, కలవగుంట మోహన్ రావు, వేములవాడ సతీష్, బండారి రవిబాబు, కొడాలి బాబురావు, నీలపాల పెద్దిరాజు, కొడాలి మధుసూదన్ రావు, సురపనేని కళ్యాణ్, వీరమాచినేని శ్రీనివాస్, అట్లూరి గాంధీ, అట్లూరి భారం బాలమురళి, వెలగలేటి పెద్దిరాజు, బట్టు కృష్ణ, ముత్యాల తిరుమల దుర్గారావు, వర్రె చంద్రశేఖర్, బేతాళ శీను, బేతాళ రవి, జక్కా రమేష్, బట్టు మునేంద్ర, భోగ శ్రీను, కొసనం శివాజీ, బట్టు ఆంజనేయులు, బట్టు నరేంద్ర, మేడేపల్లి సుబ్బారావు,గుడివాడ నియోజకవర్గం లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ జడ్పిటిసి చిన్ని దుర్గాప్రసాద్, పిల్లి బెనర్జీ, సురపనేని కళ్యాణ్, డొక్కు రాంబాబు, మేకల సత్యనారాయణ, ఏలేటి ఆగస్టు, లోయ రాజేష్, గుడివాడ ప్రభాకర్,గిరి బాబాయ్, తోట రాజేష్, ఘంటా సురేష్, నల్లమోతు జగదీష్, చుండూరి శేఖర్, గుడ్లవల్లేరు మండల యువజన విభాగ అధ్యక్షుడు గుదే రవి, చుండి బావి, పుల్లేటికుర్తి కృష్ణ, నీరుడు ప్రసాద్, క్రేన్ బాబి, అబ్దుల్ రజాక్, కర్రే నాని, కర్రే చిన్ని, చింతాడి నాగూర్, ఘంటా శ్రీను, పలు గ్రామాల ప్రజాప్రతినిధులు, గుడివాడ నియోజకవర్గ పరిధిలో గుడివాడ టౌన్, రూరల్, , గుడ్లవల్లేరు మండలాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అనుబంధ విభాగాల నాయకులు, కొడాలి నాని అభిమానులు, పెద్ద సంఖ్యలో ప్రజానీకం పాల్గొన్నారు.


TEJA NEWS