జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ప్రెస్ మీట్

జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ప్రెస్ మీట్

TEJA NEWS

జగిత్యాల ప్రాంత అభివృద్ధి విషయం లో ముఖ్యమంత్రి తో పని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డీ ఆదేశం మేరకు కాంగ్రెస్ పార్టీ లో చేరటం జరిగింది
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డీ రైతు పక్షపాతి…ముఖ్యమంత్రి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు
ఆరు గ్యారంటీ లు అమలు చేస్తారు అని నమ్మకం ఉంది మరియు ప్రజల పక్ష పాతి…
ముఖ్యమంత్రి,మంత్రులు,సహచరులు అందరి సహకారం ఉంది.
జగిత్యాల పట్టణం లో ఎక్కడా లేని విధంగా 4500 డబల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం..

డబల్ బెడ్ రూం ఇండ్ల కు మౌలిక సదుపాయాలు కల్పించడం లో కొంత ఆలస్యం అయ్యింది.
ముఖ్యమంత్రి,మంత్రులు సహకారం తో డబల్ బెడ్ రూం ఇండ్ల కు 32 కోట్ల 16 లక్షల నిధుల మంజూరుకు జీవో తీసుకురావడం జరిగింది.
20 వేల మంది బీద మధ్యతరగతి ప్రజల సౌకర్యార్థం ముఖ్యమంత్రి మంజూరు చేశారు..
నాది రాజ కీయ కుటుంబం..

మా కుటుంబం లో మాకునూరి శ్రీరంగ రావు,మాజీ మంత్రి చొక్కా రావు మా కుటుంబ సభ్యులు..మంత్రులు,ఎమ్మేల్యే లుగా కొనసాగారు.
గతంలో కాంగ్రెస్ అధికారం లో ఉంటే టిడిపి కి ఎల్ రమణ కు మద్దతు ఇవ్వడం జరిగింది..
కాంగ్రెస్ అధికారం లో ఉంటే బి అర్ ఎస్ పక్షాన పోటీ చేయటం జరిగింది…

నేను పోటీ చేసే నాటికి బి అర్ ఎస్ లో ఎంపీటీసీ, ZPTC,కౌన్సిలర్ సభ్యులు ఎన్నికలకు అభ్యర్థుల కూడా లేరు..
మాజీ ఎంపీ కవిత సహకారం తో రాజకీయాలు రావడం జరిగింది..
డబల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం కోసం ముగ్గురు గుత్తేదారులు వచ్చి వెళ్ళిపోతే…దగ్గరి వ్యక్తిని తీసుకువచ్చి పేద మధ్యతరగతి ప్రజల కోసం వాటిని పూర్తి చేయటం జరిగింది…

ప్రజా స్వామ్యం లో అధికార పక్ష పార్టీ తో పని చేయటం వల్ల నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేయటం సాధ్యం అవుతుంది..
బి అర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ విమర్శ వారి విజ్ఞతకే వదిలేస్తాం
కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన వారినీ గతం లో బి అర్ ఎస్ పార్టీ లోకి ఆహ్వానించలేధా అని వారిని ప్రశ్నిస్తున్న…
ప్రజా స్వామ్యం లో హుందా తనం తో రాజకీయాలు చేయాలి…
బి అర్ ఎస్ వేదిక పై నన్ను విమర్శించిన ప్రతి ఒక్కరూ ఆత్మ విమర్శ చేసుకోవాలి…

నాపై చేసిన తప్పుడు ఆరోపణలు ఖండిస్తున్నా
నా ఆర్థిక పరిస్తితి గురించి నాకు భయం లేదు..నా ఆర్థిక పరిస్తితి ప్రజలందరికీ తెలుసు..
సేవా భావం తోనే రాజకీయాలకి వచ్చా….
జగిత్యాల నియోజకవర్గ సమగ్ర అభివృద్ది కోసం కాంగ్రెస్ పార్టీ లో చేరటం జరిగింది అని అన్నారు…

Print Friendly, PDF & Email

TEJA NEWS

Comments

No comments yet. Why don’t you start the discussion?

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి