TEJA NEWS

తిరుపతి నగరాన్ని అన్ని విధాల అభివృద్ది చేద్దామని, మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బందికి అన్ని విధాల సహాయ సహాకారాలు అందిస్తామని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నగరపాలక సంస్థ అన్ని విభాగాల అధిపతులతో, అధికారులతో కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్ ఆధ్వర్యంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సమావేశం అయినారు. మొదటిసారిగా నగరపాలక సంస్థకు విచ్చేసిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుకు అధికారులు బొకేలు అందించి స్వాగతం పలికారు. అధికారుల పరిచయం అనంతరం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ తిరుపతి అభివృద్ధికి అందరం కలిసి పనిచేసి రాష్ట్రంలోనే ఓక ప్రత్యేక స్థానానికి తీసుకువద్దామన్నారు. తిరుపతి నగరంలో ముఖ్యంగా శానిటేషన్, మంచినీరు, రహదారుల అభివృద్దికి ప్రాధాన్యత ఇద్దామన్నారు. చాలా కాలువల్లో వ్యర్ధాలు, ప్లాస్టిక్ బాటిల్స్, ధర్మాకోల్ వ్యర్ధాలతో నిండిపోయి మురికినీరు సాఫిగా వెల్లడం లేదనే విషయాన్ని ఎమ్మెల్యే ప్రస్థావిస్తూ స్పెషల్ డ్రైవ్ చేపట్టి కాలువలు శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మాస్టర్ ప్లాన్ రోడ్లను ఇకపై నిర్మించేటప్పుడు అవి ప్రజలకి ఉపయోగపడేలా వుండాయా అని అన్ని విధాలా పరిశీలించాలని, నిర్మించదలిస్తే వాటి మన్నికపై అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతుబజార్, మార్కెట్లు, ఫిష్ మార్కెట్లను ఆధునికరిస్తే భాగుంటాయని, వీటిల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఫిష్ మార్కెట్ వద్ద వ్యర్ధాల వాసనతో ప్రజలు ఇబ్బందులు పడకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. రహదారులపై ప్యాచ్ వర్కులను ఎప్పటికప్పుడు చేపట్టాలన్నారు. పుడ్ కోర్టులను నిర్ణీత స్థలాల్లో ఏర్పాటు చేసేందుకు పరిశీలించాలన్నారు. స్లమ్‌ ఏరియాల్లోని ప్రజల ఇబ్బందులను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. తిరుపతి అభివృద్ధికి అందరం కలిసికట్టుగా సమన్వయంతో పని చేద్దామని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కోరారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, ఎంఈలు చంద్రశేఖర్, వెంకట్రామి రెడ్డి, హెల్త్ ఆపిసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ ఆఫిసర్లు సేతుమాధవ్, కె.ఎల్.వర్మ, మేనేజర్ చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.

తిరుపతిని అన్ని విధాల అభివృద్ది చేద్దాము : ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు

TEJA NEWS