TEJA NEWS

ఫిర్యాదులపై సత్వరం స్పందించి న్యాయం చేయాలి

‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ’ కార్యక్రమంలో జిల్లా ఎస్.పి.శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐ.పి.ఎస్.,

కడప జిల్లాలో బాధితులు పోలీసు శాఖకు ఇచ్చే ఫిర్యాదుల పట్ల సత్వరం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐ.పి.ఎస్., పోలీసు అధికారులను ఆదేశించారు. నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలోని పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఐ.పి.ఎస్. ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ'(పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్) కార్యక్రమంలో బాధితులతో స్వయంగా ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఫిర్యాదులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, నిర్ణీత సమయంలో వాటిని పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
సైబర్ క్రైమ్ బారిన పడ్డ బాధితులు ఫిర్యాదు మేరకు సంబంధిత పోలీస్ అధికారులకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్.పి సూచించారు. ప్రజలకు సైబర్ క్రైమ్ కు సంబంధించి ఎలాంటి సమస్య ఉన్నా ఆన్ లైన్ వెబ్ సైట్ www.cybercrime.gov.in ద్వారా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (N.C.R.P) లో మరియు టోల్ ఫ్రీ నెంబర్ 1930 కు ఫిర్యాదు చేయొచ్చని ప్రజలకు జిల్లా ఎస్.పి శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐ.పి.ఎస్ సూచించారు.

ఫిర్యాదులపై సత్వరం స్పందించి న్యాయం చేయాలి

TEJA NEWS