TEJA NEWS

రైళ్లలో సెల్ ఫోన్లు దొంగతనం చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు

పల్నాడు జిల్లా, పిడుగురాళ్ల

రైళ్లలో ప్రయాణం చేసే ప్రయాణికుల నుండి సెల్ ఫోన్లు చోరీ చేస్తున్న వ్యక్తిని పిడుగురాళ్ల రైల్వే పోలీసులు రెడ్డిగూడెం దగ్గర పట్టుకున్నారు.

గత రెండు వారాలుగా కదులుతున్న రైల్ నుండి మెట్ల పై కూర్చున్న ప్యాసింజర్ చేతుల్లో నుంచి కర్రతో కొట్టి సెల్ ఫోన్లు కింద పడగానే తీసుకోని వెళ్లిపోవడం జరుగుతుంది.

మణికంఠ అనే రాజుపాలెం మండలం చౌట పాపాయపాలెం చెందిన వ్యక్తి నుండి 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.


TEJA NEWS