TEJA NEWS

భద్రత, బందోబస్తు కొరకే గణేష్ ఆన్లైన్ నమోదు విధానం.

  • జగిత్యాల : గణేష్ మండప నిర్వాహకులు పోలీసు శాఖ వారు రూపొందించిన పోర్టల్ ద్వారా వివరాలను నమోదు చేసుకుని పోలీసు వారికి సహకరించాలి.
  • – -అప్లికేషన్ నమోదు చేయుటకు వాడవలసిన లింక్ https://policeportal.tspolice.gov.in/index.htm
  • – – జిల్లా ఎస్పీ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపిఎస్

పోలీసు శాఖ వారు రూపొందించిన గణేష్ మండపం నిర్వహణకు సంబంధించిన ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ అనేది కేవలం మండపం నిర్వహణ మరియు మండపంనకు సంబంధించిన సమాచారం కొరకు మాత్రమే రూపొందించిందని అని, ఈ యొక్క సమాచారం ద్వారా భద్రత మరియు బందోబస్తు ఏర్పాటు చేయడానికి పోలీసులకు సులువుగా ఉంటుందని , ఆన్ లైన్ ఇన్ఫర్మేషన్ కు ఎటువంటి రుసుము లేదని ఎస్పీ తెలిపారు.గణేష్ ఉత్సవాల నిర్వాహకులు గణేష్ విగ్రహాలను వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేయుటకు ముందు, ముందస్తు సమాచారం పోలీసుస్టేషన్ లో సమాచారం ఇవ్వాలని అందుకోసం ఏదైనా కంప్యూటర్, మొబైల్ నందు అప్లై చేసుకోవాలి అని అన్నారు. అందుకొరకు https://policeportal.tspolice.gov.in/index.htmఅనే site నందు వివరాలు పొందు పరచి అప్లికేషన్ ను సంబంధిత పోలీస్ స్టేషన్ నందు అందించాలని సూచించారు.

గణేష్ మండపాలను ఎవరికి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలి.

మండపం ఏర్పాటు చేసే స్థలం కోసం సంబంధిత శాఖల వారితో అనుమతులు తీసుకోవాలి.

గణేష్ మండపాల కొరకు విద్యుత్ శాఖ వారి అనుమతితోనే కనెక్షన్ తీసుకోవాలి.

షార్ట్ సర్క్యూట్ జరుగకుండా మంచి నాణ్యత గల వైరును ఉపయోగించాలి.

గణేష్ మండపాల నిర్వాహకులు వారి మండపాల కమిటీ వివరాలు, మండపాల బాధ్యత వహించే వారి వివరాలు, ఫోన్ నెంబర్ల ను మండపంలో ఏర్పాటు చేయాలి.

వృద్ధులు, చదువుకునే విద్యార్ధులకు ఎలాంటి ఇబ్బందులకు కలగకుండా ఉండే తక్కువ శబ్దకాలుష్యంతో స్పీకర్లను ఏర్పాటు చేసుకోవాలి.

సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లను వినియోగించాలి.

మండపాల్లో ఎట్టిపరిస్థితులోను డిజేను ఏర్పాటు చేయరాదు.

గణేష్ ప్రతిమలు కూర్చుండబెట్టే ప్రదేశంలో షెడ్ నిర్మాణంలో మంచి నాణ్యత గల షెడ్ ఏర్పాటు చేయవలెను.

గణేష్ మండపంలో 24 గంటలు ఒక వాలంటీర్ ఉండే విధంగా నిర్వహకులు తగు చర్యలు తీసుకోవాలి.

గణేష్ మండపాలకు వచ్చే భక్తుల సందర్శను దృష్టిలో వుంచుకోని మండపాలలో భక్తుల కోసం క్యూలైన్లను ఏర్పాటు చేయడంతో పాటు వాలంటీర్లను నియమించాలి.

గణేష్ మండపాల వద్ద ఎప్పుడైన అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ముందు జాగ్రత్తలో భాగంగా దగ్గరలో రెండు బకెట్ల నీళ్లు ఏర్పాటు చేసుకోవాలి.

గణేష్ మండపాల వద్ద మద్యం సేవించడం, పేకాట అడటం, అసభ్యకరమైన నృత్యాల ఏర్పాటు, అన్యమతస్తులను కించపరిచే విధంగా ప్రసంగాలు చేయడం, పాటలు పాడటంపై పూర్తిగా నిషేధం.

విధిగా పాయింట్ పుస్తకం ఏర్పాటు చేసుకోవాలి, పోలీసు అధికారులతనిఖీకి వచ్చినప్పుడు అందులో వ్రాసి సంతకం చేస్తారు.

మండపాల్లో ఏదైనా అనుమానాస్పదంగా బ్యాగులు, ప్లాస్టిక్ సంచులు, వస్తువులు లేదా వ్యక్తులు కనిపించినట్లుయితే తక్షణమే డయల్ 100గాని లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి.

సామాజిక మాధ్యమాలలో వచ్చే ఎలాంటి రూమర్స్, వదంతులను నమ్మకూడదు అని ఎవ్వరికైన ఎలాంటి సందేహాలు ఉన్న సంబంధిత పోలీసు వారికి లేదా DAIL 100 కి సమాచారం అందించలని సూచించారు. ఈ పండుగను అందరము శాంతి యుతంగా నిర్వహించుకోవాలని కోరారు.


TEJA NEWS