TEJA NEWS

నీట మునిగిన మోకిలా లా పాలోమా విల్లాస్

చెరువు స్థలాని కబ్జా చేసి విల్లాలు కట్టారంటున్న స్థానికులు

కోట్ల రూపాయలు పెట్టి కొన్న విల్లాలో నివాసం ఉండడమే మేము చేసిన తప్పా అంటున్న లా పలోమా విలాస్ ప్రెసిడెంట్ రాజచందర్.

శాశ్వత పరిష్కారం చూపాలంటున్న విల్లా అధికారులు

శంకర్ పల్లి, : మా గోస తీరేది ఎట్లా, మేమేం పాపం చేశాము, కోట్ల రూపాయలు పెట్టి కొన్న విల్లాల్లో నివాసం ఉండడమే మేము చేసిన తప్పా అంటూ నిలదీస్తున్న పరిస్థితి మండల పరిధిలోని లాపలోమా కమ్యూనిటీ ప్రాజెక్టులో కొనసాగుతుంది. గత రెండు రోజుల నుంచి కురిసిన వర్షానికి కమ్యూనిటీ మొత్తం మోకాళ్ళ లోతు నీళ్లతో నిండిపోయింది. అధికారులకు సమాచారం అందించి నప్పటికీ నీటిని బయటికి పంపించే చర్యలు చేపట్టకపోవడంతో పరిస్థితి మరీ దారుణంగా మారింది.కమ్యూనిటీ మొత్తం 212 విల్లాలు ఉండగా వాటిల్లో దాదాపు 1000మంది నివాసం ఉంటున్నారు.

టాక్స్ లు గ్రామపంచాయతీ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నాం, కనీస సౌకర్యాల ఏర్పాట్లు మర్చిపోతున్నారు అనే ఉద్దేశంతో తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం నుండి నీళ్లలోనే ఉంటున్నాం, ఇంకా నీటిని బయటికి పంపించే ఏర్పాటు చేయడం లేదు. మా బాధలు తీరేది ఎట్లా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి లాపలోమ ప్రాజెక్ట్ కమ్యూనిటీలో నెలకొంది. పంచాయతీ సెక్రెటరీ ఎంపీడీవో కమ్యూనిటీ పరిసరాల్లో ఉండి నీటిని బయటికి పంపించే చర్యలకు ఉపక్రమిస్తున్నారని స్థానికుల ద్వారా సమాచారం అందుతుంది.ఎన్ని విధాల ప్రయత్నం చేసినా వారి ఇబ్బందులు దూరం అవడం లేదనేది వాస్తవ పరిస్థితి. నీళ్లలోనే 18గంటల నుండి కమ్యూనిటీ మొత్తం ఉండడంతో కమ్యూనిటీలోని కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. చిన్నపిల్లలు, అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వృద్ధులు కమ్యూనిటీలో ఉండటం వలన మరింత ఆరోగ్యపరమైన సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. నియోజక వర్గం ఎమ్మెల్యే కాలే యాదయ్య లా పాలోమా విలాస్ ను చేరుకొని తీవ్రతతను తెలుసుకున్నారు.జిల్లా స్థాయి అధికారులు వెంటనే స్పందించి నిలిచిన నీటిని బయటకు పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. సహాయ చర్యలకై మోకీలా మరియు శంకరపల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.


TEJA NEWS