TEJA NEWS


కావలి, సోషల్‌ మీడియా రిపోర్టర్‌ వెంకటేశ్వర్లు : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో రోజురోజుకు సమీకరణాలు మారుతున్నాయి. ఎమ్మెల్యే అభ్యర్ధుల జాబితా శరవేగంగా మారుతున్నాయి. ఆక్రమంలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని అధిష్టానం కందుకూరు ఎమ్మెల్యే అభ్యర్ధిగా పంపే ఆలోచనలో సర్వేలు నిర్వహిస్తున్నారని జోరుగా ప్రచారం సాగుతుంది. జిల్లాలో ఒక అసెంబ్లీ స్థానాన్ని సిఎం జగన్‌మోహన్‌రెడ్డి బిసిలకు కేటాయించనున్న నేపధ్యంలో కావలి ఎమ్మెల్యే అభ్యర్ధితత్వాన్ని ఆదిశంకర గ్రూప్‌ ఇంజనీరింగ్‌ కాలేజ్‌ల చైర్మన్‌ వంకి పెంచలయ్యను పోటీ బరిలో నిలపాలని అధిష్టానం యోచిస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రడ్డికి 2024 సార్వత్రిక ఎన్నికల్లో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని అధిష్టానం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. గతంలో కావలి ఎమ్మెల్యేగా ప్రస్తుత రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్‌రావు కూడా కావలిలో గెలుపొంది ఉండటంతో ఆయన మద్దతు వంకి పెంచలయ్యకు ఇస్తే గెలుపు సులభతరం అవుతుందని రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. కందుకూరులో ప్రస్తుత సిట్టింగ్‌ ఎమ్మెల్యే మానుగుంటకు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డికి సామాజికపరంగా ఇరువురి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలతో గెలుపు సునాయశంగా ఉంటుందని చర్చలు సాగుతున్నాయి. అధిష్టాన నిర్ణయం ఏ మేర ఉంటుందే వేచిచూడాలి మరీ..


TEJA NEWS