TEJA NEWS

తెలంగాణ తల్లిని అవమానపరిచిన సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలి

బీఆర్ఎస్వి జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య

తక్షణమే తెలంగాణ తల్లి విగ్రహంను సచివాలయంలో ఏర్పాటు చేయాలి

తెలంగాణ రాష్ట్రానికి రాజీవ్ గాంధీ కి సంబంధం ఏమిటి?తెలంగాణ ఏర్పాటులో ఆయన పాత్ర శూన్యం

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు కాంగ్రెస్ సర్కార్ చర్యకు నిరసనగా అలంపూర్ నియోజకవర్గం ఐజ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య అధ్యక్షతన తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా కోఆర్డినేటర్ కురవ పల్లయ్య మాట్లాడుతూ..

-తెలంగాణ ఆస్తిత్వంతో పెట్టుకుంటే రాజకీయ సమాధి కాంగ్రెస్ కి తప్పదు.

-తక్షణమే తెలంగాణ తల్లి స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తరలించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించాలి.

ఆరోజు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి కోసం ఏర్పాటు చేసిన స్థలంలోనే తెలంగాణ తల్లి విగ్రహంను ఏర్పాటు చేయాలి.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో రాజీవ్ గాంధీ పాత్ర శూన్యం. అసలు రాజీవ్ గాంధీకి తెలంగాణకు సంబంధం లేదు.

అయినా ఈ చేతగాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ బాసులకు గులాంగిరి చేస్తూ ఢిల్లీ బాసుల మెప్పుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రజల అస్తిత్వాన్ని అగౌరపరచడం సిగ్గుచేటు.

దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మరియు తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని కానీ కించపరిస్తే ఖచ్చితంగా గుణపాఠం చెబుతాం.

తక్షణమే తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పి వేరేచోట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆ స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.

లేనిపక్షంలో వచ్చే మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాజమర్యాదలతో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని గాంధీభవన్ కు తరలించి,
ఆ సచివాలయ స్థలంలోనే తెలంగాణ తల్లిని కచ్చితంగా ఏర్పాటు చేస్తాం.

ఈ కార్యక్రమం లో ఆలయ మాజీ ధర్మకర్త రమేష్ బాబు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు దేవరాజు, ఠాగూర్ తిమ్మప్ప, కిష్టాపురం ఉరుకుందు, బుడగ జంగం కృష్ణ, రాజు, వీరేష్ ప్రకాష్, చిన్న రాజు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS