TEJA NEWS

రాహుల్ గాంధీని విమర్శిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు
ఎమ్మెల్యే మేఘా రెడ్డి*_
వనపర్తి

కాబోయే భావిభారత ప్రధాని, పార్లమెంట్ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పై బీజేపీ నాయకులు ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే
తన్వీదర్ సింగ్ చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తీవ్రంగా స్పందించారు

బుధవారం వనపర్తి ఖిల్లా ఘణపురం మండలం కేంద్రంలో మండల పార్టీ శ్రేణులతో కలిసి ఆయన తన్వీందర్ సింగ్ దిష్టిబొమ్మ దహనం కార్యక్రమంలో పాల్గొన్నారు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…రాహుల్ గాంధీ బయటకు వస్తే చంపేస్తామని, ఇందిరా గాంధీకి పట్టిన గతే నీకు పడుతుందని బహిరంగంగా మాట్లాడినా తన్విందర్ సింగ్ ను వెంటనే అరెస్టు చేసి జైల్లో ఉంచాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు

బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ విషయంలో కనీసం స్పందించలేదని ఎమ్మెల్యే మండిపడ్డారు

కార్యక్రమంలో జిల్లా గణపురం మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS