TEJA NEWS

మీ ఆరోగ్యం తో పాటు మీరు నడిపే వాహనాల ఆరోగ్యం కూడా చూసుకోవాలి

పోలీస్‌ వాహనాలను తనిఖీ చేసిన జిల్లా అడిషనల్ ఎస్పీ జోగుల చెన్నయ్య

మహబూబాబాద్ జిల్లా పరిధిలోని మహబూబాబాద్ సబ్‌డివిజన్‌ కు చెందిన పోలీస్‌ వాహనాల పనితీరు, నిర్వహణను ఈరోజు అడిషనల్ ఎస్పీ జోగుల చెన్నయ్య ఈరోజు మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీస్‌ వాహనాలను నితరంతరంగా ప్రజాసేవలకు వినియోగించాల్సి ఉన్నందున ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. వాహనాలపై ప్రత్యేక శ్రద్ధ వహించలని, మంచి కండిషన్‌ లో ఉంచుకోవాలని వాహన డ్రైవర్లను ఆదేశించినారు. పోలీసు అధికారుల ఆధీనం లో ఉన్న వాహనాలను సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, సొంత వాహ నంలా మంచి కండిషన్‌లో ఉంచి ఎప్పటికప్పుడు సర్వీసింగ్‌, ఇంజన్‌ ఆయిల్‌, టైర్ల నిర్వహణ, ఉత్తమ ప్రమాణాలను పాటించుకుంటూ, డ్రైవర్లకు నిర్వహణపై ప్రత్యేక శిక్షణ తరగతులను నిర్వహించాలని తెలియజేశారు. డ్రైవర్స్ సైతం వారి ఆరోగ్యం కాపాడుకోవాలని అన్నారు. నేత్ర పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. వాహనాల ఆరోగ్యం, డ్రైవర్స్ ఆరోగ్యం ముఖ్యం అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ(ఎంటీఓ) సోములు, ఆర్.ఐ అనిల్ డ్రైవర్స్ సిబ్బంది పాల్గొన్నారు.


TEJA NEWS