TEJA NEWS

రాజీవ్ ఆరోగ్యశ్రీ E-KYC కేంద్రాన్ని సందర్శించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

తెలంగాణ రాష్ట్రంలోని ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్ధిపొందే వారి కోసం వైద్య సేవల పరిమితిని రూ. 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచింది. ఇందుకు సంబంధించిన కెవైసి ప్రక్రియను పూర్తి చేయడానికి 124 డివిజన్ పరిధిలోని పిజెఆర్ నగర్ మొగులమ్మ కాలనీ లో ఏర్పాటుచేసిన ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డ్ E-KYC నమోదు కేంద్రాన్ని డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ సందర్శించి కెవైసి ప్రక్రియను పరిశీలించడం జరిగింది.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సాయం పరిమితిని అయిదు నించి పది లక్షలకు పెంచి, పూర్తి ఉచితంగా పది లక్షల రూపాయల వరకు కుటుంబం మొత్తానికి ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకునే వీలు కల్పించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియచేసారు. అర్హులైన పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సాయం ఎంతో మంది పేదలకు ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి అని అన్నారు. కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, జిల్లా గణేష్, జి.రవి, CH. భాస్కర్, పోశెట్టిగౌడ్, యాదగిరి, సంగమేష్, అగ్రవాసు, వాలి నాగేశ్వరరావు, మౌలానా, మహేష్, శామ్యూల్, రవీందర్, మీసాల జనయ్య, పుట్టం దేవి, సరిత, తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS