TEJA NEWS

ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలుచేయాలి : కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

సూర్యాపేట జిల్లా : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను వెంటనే చిత్తశుద్ధితో అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. 9వ వార్డులో జరిగిన సిపిఎం శాఖ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్న నేటికీ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం పూర్తిస్థాయిలో అమలు కాలేదు అన్నారు. వ్యవసాయ కార్మికులకు ఏడాదికి 12 వేల రూపాయలు ఇస్తామని చెప్పి నేటికీ ఇవ్వకపోవడం వేదాలు వ్యవసాయ కార్మికులను మోసం చేయడమేనని ఆరోపించారు.రాష్ట్రంలో 40 లక్షల కుటుంబాలు రేషన్ కార్డు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు అన్నారు.ఇందిరమ్మ పథకం కిందఇల్లు నిర్మిస్తామని ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇస్తామని మాయమాటలు చెప్పారు తప్ప ఏ ఒక్క కుటుంబానికి ఇల్లు కట్టించలేదన్నారు.ప్రభుత్వ భూములలో వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు వెంటనే పాస్ పుస్తకం ఇవ్వాలని కోరారు.

వృద్ధులు,వితంతువులు,వికలాంగులు,ఒంటరి మహిళలు కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారని వెంటనే కొత్త పింఛన్లు మంజూరు చేయాలని కోరారు.జమిలీ ఎన్నికల విధానానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం సరైన విధానం కాదు అని అన్నారు. 2029 నుంచి ఒకే దేశం- ఓకే ఎన్నిక విధానాన్ని ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర క్యాబినెట్ లో ప్రవేశపెట్టడం ఫెడరల్ స్ఫూర్తికివిరుద్ధమన్నారు. దేశంలో ప్రతిపక్ష పార్టీలన్నీ జమిలి ఎన్నికల పద్ధతి అనుకూలం కాదు అని చెప్తు వస్తున్నప్పటికీ బిజెపి ప్రభుత్వం మొండిగా వ్వహరిస్తుందని ఆయన విమర్శించారు. గత సంవత్సరం 10 రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరిగాయని, వీటికి 2028 మళ్లీ ఎన్నికలు జరగవలసి ఉంది అన్నారు. అప్పుడే ఏర్పడిన ప్రభుత్వాలు ఒక సంవత్సరం లేదా అంతకంటే తక్కువ సమయం మాత్రమే అధికారంలో ఉంటాయన్నారు. హిమాచల ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, కర్ణాటక, తెలంగాణ, మిజోరాం, మధ్యప్రదేశ్, చత్తీస్ గడ్, రాజస్థాన్ రాష్ట్రాలలో పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.కేంద్ర ప్రభుత్వం తక్షణమే తన నిర్ణయాన్ని మార్చుకొని మెజార్టీ ప్రజల, రాజకీయ పార్టీల నిర్ణయాన్ని గౌరవించాలని కోరారు. ఈ మహాసభకు పిట్టల రాణి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎల్గూరి గోవింద్ సిపిఎం పార్టీ వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్, పట్టణ నాయకురాలు శశిరేఖ, భాగ్యమ్మ,ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS