TEJA NEWS

కమిషన్ లు లెంది బి.ఆర్.ఎస్ నాయకులు పని చేయరు
సవాల్ ను స్వీకరిస్తూన్నాం …..చర్చకు రండి – మాజీ ఎంపీటీసీ తిరుపతి

ధర్మపురి -….
కమిషన్ లు లేనిది బి.ఆర్.ఎస్ నాయకులు పని చేయరు అని జీవోను మీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన పది సంవత్సరాల నుండి నష్ట పరిహారం ఎందుకు రాలేదు అని చేగ్యాం మాజీ ఎంపీటీసీ ప్రశ్నించారు. మీ సవాల్ ను స్వీకరిస్తున్నాం అని బహిరంగ చర్చకు సిద్దం అని అన్నారు. సోమవారం జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీటీసీ రంగు తిరుపతి మాట్లాడుతూ బి.ఆర్.ఎస్ ప్రభుత్వ హయాంలో 18 కోట్ల రూపాయల జీవోను జారీ చేసిన , పది సంవత్సరాల పాటు చేగ్యాం ముంపు గ్రామానికి నిధులు ఎందుకు విడుదల చేయలేదని , అసలు ముంపు గ్రామానికి రావాల్సిన 25 కోట్ల నష్ట పరిహారంను తరిగించి18 కోట్ల కు ఎందుకు జీవోను విడుదల చేశారని ప్రశ్నించారు. ఒకసారి జీవోను పాస్ చేశాక దానిని మళ్ళీ తిరిగి సరి చేయరాదని మిగిలిన 10 కోట్ల రూపాయలు కూడా మేము ఇప్పిస్తామని తెలిపారు. మీరు ఇవ్వలేని 18 కోట్ల రూపాయలను మా ప్రభుత్వ హయాంలో ఇచ్చినందుకు మీరు క్యాంప్ ఆఫీసును ముట్టడిస్తారా…అని అన్నారు.

బి.ఆర్.ఎస్ నాయకులు కేవలం రాజకీయ సౌలభ్యం కోసమే పది సంవత్సరాలు ముంపు గ్రామ బాధితులకు నష్టపరిహారం ఆపారని , 126 కుటుంబాలకు 20 వేల నుండి 40 వేల రూపాయల వరకు లంచాలు వసూలు చేశారని కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు నందయ్య అన్నారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ గ్లోబల్ ప్రచారాలు మేము చేస్థలేము అని , గత పది సంవత్సరాలుగా మా నష్ట పరిహారం రాకపోవడం బి.ఆర్.ఎస్ నాయకుల పనే అని , గతంలో చేగ్యాం ముంపు బాధితులు వందల సార్లు క్యాంప్ ఆఫీస్ ల చుట్టూ తిరిగినా పరిహారం అందలేదని , బి.ఆర్.ఎస్ నాయకులు ప్రతి ఒక్కరి దగ్గర లంచాలు వసూలు చేశారని, మేము సమయభావంతో ఉన్నాం కాబట్టి విప్ అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ చొరవతో నష్ట పరిహారంను ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లోనే విడుదల చేశారని అన్నారు. ఇప్పడికైన విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరీ నీ ఏకవచనంతో పిలిస్తే , తప్పుగా మాట్లాడితే మేము ఊరుకోమని మీ సవాలును స్వీకరిస్తున్నాం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ డైరెక్టర్లు,మాజీ సర్పంచులు , మండల సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS