TEJA NEWS

విద్యారంగ పితామహుడు అబుల్ కలామ్ ఆజాద్..

చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ.

భారతదేశంలో విద్యారంగాభివృద్ధికి ఎనలేని కృషి చేసిన దార్శనికుడు భారతరత్న మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ అని రాష్ట్ర కాంగ్రెస్ మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి హాజీ షేక్ సలాం అన్నారు. భారతరత్న మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి కార్యక్రమం కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా జరిగింది.ఈజిప్టు దేశంలో పుట్టి ఇండియా స్వతంత్రం కోసం అహరహం పోరాటం చేసిన నిష్కళంక దేశభక్తుడు అబుల్ కలామ్ ఆజాద్ అని అన్నారు. అబుల్ కలాం ఆలోచన విధానాలను అర్థం చేసుకున్న ఘనత రాజీవ్ గాంధీ కి దక్కుతుందని రాష్ట్ర కాంగ్రెస్ మైనార్టీ సెల్ కార్యదర్శి షేక్ నస్రుద్దీన్ అన్నారు. అబుల్ కలాం ఆలోచనలను యువ ప్రధాని రాజీవ్ గాంధీ ఆచరణాత్మకం చేయడం ద్వారానే నేడు భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగాలలో అగ్రదేశాలతో పోటీ పడగలుగుతుందని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎం రాధాకృష్ణ అన్నారు దివంగత ముఖ్యమంత్రి వైయస్ ఆర్ అబుల్ కలాం ఆశయాలను ఆకళింపు చేసుకొని పేద విద్యార్థులు సైతం ఉన్నత విద్యావంతులను చేయాలని లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని గత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నీరు కార్చారని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడైనా పెండింగ్ లో ఉన్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించి ఆదుకోవడమే మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ కి అందించే నిజమైన ఘన నివాళి అవుతుందని రాధాకృష్ణ అన్నారు. కార్యక్రమంలో తొలుత మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి మున్సిపల్ మాజీ కో ఆప్షన్ సభ్యుడు షేక్ బాబా ఫక్రుద్దీన్ మైనార్టీ నాయకులు షేక్ గాలిబ్ సాహెబ్ హాజీ షేక్ సలాం షేక్ నస్రుద్దీన్ షేక్ నాగూర్ వలి లు పూలమాలలు వేసి జయంతి జేజేలు పలికారు.ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త యం రాధాకృష్ణ, రాష్ట్ర కాంగ్రెస్ మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి హాజీ షేక్ సలాం, మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి షేక్ నస్రుద్దీన్, మున్సిపల్ మాజీ కో ఆప్షన్ సభ్యుడు షేక్ బాబా ఫక్రుద్దీన్, మైనారిటీ నాయకులు షేక్ గాలిబ్ సాహెబ్ జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు జాస్తి నాగాంజనేయులు, జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఇంటూరి భవాని వెంకటేష్, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యస్సీ సెల్ అధ్యక్షుడు కాటూరి కోటేశ్వరరావు, నాదెండ్ల మండల కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ నాగూర్ వలి, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కారుచోల స్వప్న కుమార్ మైనారిటీ విభాగం నాయకులు షేక్ దాదాసాహెబ్ షేక్ మస్తాన్ వలి షేక్ ముజీబ్, భారత జాతీయ విద్యార్థి సంఘం అధ్యక్షుడు షేక్ బాషా, షేక్ సుబాని, మాచవరపు కొండలు, జిల్లా కాంగ్రెస్ యస్టీ ‌విభాగం కార్యదర్శి కేతావతు సాంబశివ నాయక్, ప్రత్తిపాటి కోటయ్య, యడ్లపాడు మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వల్లెపు సుబ్బారావు, నాగండ్ల భరత్ కుమార్, దండా శ్రీరామ మూర్తి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.


TEJA NEWS