TEJA NEWS

తెలుగురాష్ట్రాల్లో శివాలయాలకు పోటెత్తిన భక్తులు

పెద్దపల్లి జిల్లా:
కార్తీక మాసంలో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనది గా భావిస్తారు. ఈ కార్తీక పౌర్ణమి అనేది హరి, హారులకు అత్యంత ప్రీతికరమైన మాసం. అన్ని మాసాల్లోను కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత కలిగినది అని వేదాలు, పురాణాలు చెబుతు న్నాయి.

ఈ మాసంలో ఎక్కువగా శివునికి, విష్ణువుకి పూజలు చేస్తారు. ఇద్దరికీ ఎంతో ఇష్టమైన మాసం అందుకే ఎక్కడ చూసినా గాని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా గోదావరి నదికి భక్తులు పోటెత్తారు..

పెద్దపల్లి జిల్లా మంథని సమీపంలోని గోదావరి నది తీరాన ఉదయం నుంచే వేలాది మంది భక్తులు పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరిలో కార్తీక దీపాల ను వదిలారు…పెద్ద ఎత్తున భక్తులు రావడంతో గోదావరి నది కిక్కిరిసి పోయింది.

కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ఆలయాల్లో మహిళలు కార్తీక దీపాలను వెలిగించి, మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయాల్లో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో కిటకిటలాడుతున్నాయి. జిల్లాలోని ఆలయాలను దీపాలంకరణతో అందంగా ముస్తాబు చేశారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. కొత్తగూడెం పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో నూ ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకల్లో భాగంగా శివాలయాల్లో మహిళలు కార్తీక దీపాలు వెలిగించా రు.. కొత్తగూడెం పట్టణం లోని శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.


TEJA NEWS