TEJA NEWS

బొమ్మూరు పాలిటెక్నిక్ కాలేజీ స్పోర్ట్స్ మీట్లో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల

రాజమండ్రి బొమ్మూరు పాలిటెక్నిక్ కాలేజీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ & గేమ్స్ మీట్ 2024 -25 కార్యక్రమానికి కాలేజీ వారి ఆహ్వానం మేరకు ముఖ్య అతిధిగా పాల్గొన్న రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ .. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కి ఘనంగా స్వాగతం పలికిన కార్యక్రమ నిర్వాహకులు..ఈ సందర్భంగా కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండా ఆవిష్కరణలో పాల్గొని జెండా ఆవిష్కరించడం జరిగింది.. అనంతరం రిబ్బన్ కట్ ఈ పోటీలను ప్రారంభించడం జరిగింది..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ “పలు ప్రాంతాల నుండి కబడ్డీ మరియు వాలీబాల్ పోటీలకు విచ్చేసిన ప్రతీ ఒక్క క్రీడాకారుడుకి నా అభినందనలు..ఇటువంటి క్రీడలు మానసికంగా ఉత్తేజాన్ని శారీరక ధారూఢత్వాన్ని పెంపొందించడానికి దోహదపడతాయని ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ & గేమ్స్ మీట్ 2024 -25 కార్యక్రమం నిర్వహిస్తున్న నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేసారు.. ప్రతీ ఒక్కరూ ఈ పోటీలలో ప్రతిభను ప్రదర్శించి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు అధిరోహించాలని ఆకాంక్షించారు..

ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..


TEJA NEWS