కొంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …
ఈరోజు కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ సందర్శించారు.
ఈ సంధర్బంగా విద్యార్థులు స్కూల్ లో త్రాగునీటి సౌకర్యం సరిగా లేదని, ప్లే గ్రౌండ్, కిచెన్ ను అభివృద్ధి పరచాలని ఎమ్మెల్యే కి తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ….. గత పదేళ్ల కాలంలో నియోజకవర్గంలోని ఎన్నో ప్రభుత్వ పాఠశాలలను పరిచామని, పాఠశాలలో నెలకొని ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని
స్కూల్ లో నెలకొని ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్రీహరి, మున్సిపల్ ఛైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, వైస్ చైర్మన్ గంగయ్య నాయక్, కౌన్సిలర్లు వినోద్, రవీందర్, సువర్ణ, చింతల దేవేందర్ యాదవ్, నాయకులు ప్రవీణ్ రావు, పాఠశాల హెచ్ఎం కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.