TEJA NEWS

కంప్యూటర్ సైన్స్ఇంజనీరింగ్లో వనపర్తి అయిందాల ప్రశాంతికి డాక్టరేట్
వనపర్తి :
వనపర్తి పట్టణం రాయగడ వీధికి చెందిన అయిందాల ఓంకార్ కుమార్తె అయిందాల ప్రశాంతికి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ను ప్రకటించినట్లు అయిందాల ప్రశాంతి తెలియజేస్తూ లెర్నింగ్ ఫ్రేమ్ వర్క్ అండ్ ఆల్గరిథమ్స్ ఫర్ ఎనో మలి డిటెక్షన్ టూ వర్డ్స్ సెక్యూరిటీ అనే అంశంపై సి ఎస్ సి సిబిఐటి (ఏ ) విభాగాధిపతి ప్రొఫెసర్ రవీందర్ రెడ్డి మార్గదర్శకత్వంలో పరిశోధన చేసి సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించడంతో ఆమెకు ఈ డాక్టరేట్ లభించిందని అయిందల ప్రశాంతి గత కొన్నేళ్లుగా హైదరాబాదు నల్ల నరసింహారెడ్డి కాలేజీలో అసోసియేటెడ్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారని కానీ ప్రశాంతి ప్రాథమిక విద్య కొత్తకోటపబ్లిక్ స్కూల్లో, హై స్కూల్ విద్య లిటిల్ బర్డ్స్ హై స్కూల్ లో, ఇంటర్మీడియట్ వనపర్తి స్కాలర్షిప్ జూనియర్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కొట్టం తులసి రెడ్డి కాలేజీలో, ఎంటెక్ శంషాబాద్ వర్ధమాన్ కళాశాలలో పూర్తి చేయడం జరిగిందని తెలియజేస్తూ తనకు విద్య నేర్పిన గురువులు అధ్యాపకులు డాక్టర్ గులాం హుస్సేన్, డాక్టర్, నయనతార, రాజ వర్ధన్ రెడ్డిలకు కృతజ్ఞతలుతెలిపారు. కంప్యూటర్ రంగంలో పరిశోధన చేసి సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించి డాక్టరేట్ పొందిన అయిందాల ప్రశాంతికి అభినందనలు తెలుపుతూ భవిష్యత్తులో ఆ రంగంలో మరింత కృషి చేయాలని బంధుమిత్రులు శ్రేయోభిలాషులు కోరారు.


TEJA NEWS