TEJA NEWS

శ్రీరామ నవమి సందర్భంగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పట్టు వస్త్రాలు సమర్పించారు.ఖమ్మం బైపాస్ రోడ్డు రాపర్తి నగర్ సమీపాన నెలకొన్న శ్రీఅభయాంజనేయ స్వామి ఆలయాన్ని ఎంపీ రవిచంద్ర సందర్శించి తన గోత్రనామంతో ప్రత్యేక పూజలు చేసి స్వామి వారికి పట్టు వస్త్రాలు అందజేసి శ్రీరామ నవమి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. ఆలయానికి విచ్చేసిన ఎంపీ రవిచంద్రకు అర్చకులు మంగళవాయిద్యాలు, పూర్ణకుంభంతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.


TEJA NEWS