TEJA NEWS

వైసీపీ ప్రభుత్వ హయాంలో దుర్భిక్షంగా తయారైనా బనగానపల్లె పట్టణ డ్రైనేజి వ్యవస్థ
జగన్ పాలన ఆర్థిక దుర్వినియోగం, అవినీతిలకు మారుపేరుగా మారింది.

ఏప్రిల్ 23– బనగానపల్లె పట్టణంలోని ఈద్గ నగర్ లో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ప్రజాగళం కార్యక్రమంలో బనగానపల్లె టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా బీసీ జనార్దన్ రెడ్డి ప్రసంగిస్తూ..
గత ఐదు సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వ హయాంలో బనగానపల్లె పట్టణంలో కనీసం మురికి కాలవలలో చెత్త తీయక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు, డ్రైనేజ్ కాలవలలో ఎక్కడ చెత్త అక్కడ పేరుకుపోయి దుర్భిక్షంగా తయారయ్యింది. గత ఐదు సంవత్సరాలుగా వైసిపి నాయకుడికి మురికి కాలువలను శుభ్రపరచాలన్న సోయ కూడా లేదు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో దగ్గరుండి మురికి కాలువలను శుభ్రపరిస్తే, ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం మురికి కాలవాలను పట్టించుకోవడం లేదు.
జగన్ రెడ్డి అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఆంధ్రప్రదేశ్ మొత్తం నిర్ణయించుకుంది. జగన్ రెడ్డి ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు, జగన్ ప్రభుత్వాన్ని అధికారం నుంచి ప్రజలే దించుతారు అని అన్నారు.


కేంద్ర ప్రభుత్వ సహకారంతో తెలుగుదేశం ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును 72% పూర్తి చేస్తే 2019 లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ ను అడ్డుకుంది. వైఎస్సార్‌సీపీ హయాంలో రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ అధ్వాన్నంగా మారాయి. జగన్ పాలన ఆర్థిక దుర్వినియోగం, అవినీతిలకు మారుపేరుగా మారింది. కలెక్టరేట్ కార్యాలయాలు, రైతు బజార్ భవనాలు, ప్రభుత్వ కళాశాలలతో సహా అనేక ప్రభుత్వ ఆస్తులను జగన్ ప్రభుత్వం తనఖా పెట్టింది అని అన్నారు.


రాబోయో ఎన్నికల్లో తెదేపా జనసేన భాజపా కూటమి ఘన విజయం సాధిస్తుంది.
జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక నిరుద్యోగుల పరిస్థితి దారుణంగా తయారు అయిందని ఉద్యోగాలు లేక యువత ఇబ్బందులు పడుతున్నారు, ఉద్యోగాలు కల్పించడంలో విఫలం అయ్యారు జగన్ రెడ్డి,
యువగళం పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ లోని 20 లక్షల నిరుద్యోగులకు ఉపాధి, మరియు ప్రతి నిరుద్యోగికి ‘యువగళం నిధి’ కింద నెలకు రూ. 3000/- తెలుగుదేశం అధికారంలోకి రాగానే ఇస్తుందని పేర్కొన్నారు.
అలాగే చంద్రబాబు ప్రకటించిన 6 పథకాలను ఇంటింటికి ప్రజలకు వివరించారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, బీసీ అభిమానులు పాల్గొన్నారు.


TEJA NEWS