TEJA NEWS

బాలాజీనగర్ డివిజన్ పరిధిలోని కేపిహెచ్బీ కాలనీలో మల్కాజిగిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కుమార్తె డాక్టర్ మౌనిక రెడ్డి తో కలిసి స్థానిక కార్పొరేటర్ శ్రీమతి శిరీష బాబురావు ప్రచారం నిర్వహించారు..

కేపిహెచ్బి కాలనీలోని 2వ మరియు 3వ రోడ్లలో ఇంటింటికి తిరుగుతూ బిఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ని గెలిపించాలని ప్రచారం నిర్వహించారు…

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ మల్కాజ్గిరి బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి అఖండ మెజార్టీతో విజయం సాధిస్తారని.. బిఆర్ఎస్ పార్టీ పట్ల మన నాయకుడు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారని… కాంగ్రెస్ వైఫల్యాలను, 420 హామీలతో ప్రజలను వంచించిన విషయాలను వారికి అర్థమయ్యేలా వివరిస్తూ కారు గుర్తుకే ఓటు వేసి లక్ష్మారెడ్డి ని గెలిపించాలని ఆమె కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పగుడాల బాబురావు , డివిజన్ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, కార్యదర్శి వెంకటేష్ చౌదరి, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి అనితా శ్రీపాద , డివిజన్ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి అరుణా శెట్టి , సీనియర్ నాయకులు పవన్ కుమార్, సోషల్ మీడియా అధ్యక్షుడు కిరణ్ కుమార్, తిరుపతిరావు, జాన్ మోసెస్, నాగేశ్వర్ రావు, లక్ష్మి రాజ్యం, అనిత, లక్ష్మి, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS