TEJA NEWS

We will undertake two constructions on Tirumala Hill: CM Revanth

తిరుమల కొండపై రెండు నిర్మాణాలు చేపడతాం: సీఎం రేవంత్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎంతో చర్చించి తెలంగాణ ప్రభుత్వం తరఫున తిరుమల కొండపై సత్రం, కల్యాణ మండపం నిర్మిస్తామన్నారు. తద్వారా తెలంగాణ నుంచి వచ్చే భక్తులతో పాటు దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు సౌకర్యంగా ఉంటుందని రేవంత్ రెడ్డి అన్నారు.


TEJA NEWS