TEJA NEWS

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై కేసు నమోదు

శంకర్ నాయక్ పై భూకబ్జా కేసు

హనుమకొండ సుబేదారి పీఎస్ లో కేసు నమోదు

500 గజాల స్థలాన్ని కబ్జా చేసినట్టు ఆరోపణలు

బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై పోలీసు కేసు నమోదయింది. భూకబ్జా వ్యవహారంలో హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఆయనపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే… నగరంలోని వినాయకనగర్ లోని దుర్గాదేవి కాలనీలో 500 గజాల స్థలాన్ని శంకర్ నాయక్ కబ్జా చేసేందుకు యత్నించినట్టు ఆయనపై ఆరోపణలు వచ్చాయి.

ఈ స్థలానికి చెందిన యజమానులకు చెందిన కంటెయినర్ తో పాటు గృహోపకరణ వస్తువులను కూడా దొంగిలించిన విషయంలో శంకర్ నాయక్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదయింది. బాధితులపై శంకర్ నాయక్ దాడికి పాల్పడ్డారని, వారి సెల్ ఫోన్లు కూడా లాక్కున్నారనే ఆరోపణలు ఉన్నాయి. శంకర్ నాయక్ పై వరుసగా ఫిర్యాదులు అందుతుండటంతో పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని విచారణ చేపట్టారు.

మరోవైపు 2017లో కూడా మహబూబాబాద్ లో శంకర్ నాయక్ పై కేసు నమోదయింది. అప్పటి జిల్లా కలెక్టర్ ప్రీతిమీనాతో అనుచితంగా ప్రవర్తించారంటూ కేసు నమోదు చేశారు. అయితే ఆయనపై మోపిన అభియోగాలు రుజువు కాకపోవడంతో ప్రజాప్రతినిధుల కోర్టులో కేసు వీగిపోయింది.


TEJA NEWS