TEJA NEWS

జిల్లాలో సమగ్ర ఇంటింటి కుటుంబంసర్వే ను పకడ్బందీగా పూర్తి చేయాలి…….. జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి

వనపర్తి :
వనపర్తి జిల్లా
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పకడ్బందీగా గా పూర్తి చేయడానికి ప్రతి ఎన్యుమరేటర్ ను అణువంత అనుమానం లేకుండా శిక్షణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణపై ఐ.డి. ఒ.సి సమావేశ మందిరంలో మండల ప్రత్యేక అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీఓ లు, ఎంపీఒ లకు మాష్టర్ ట్రైనర్ లు సర్వే ఏ విధంగా చేయాలి, ఎన్యుమరెటర్ల బాధ్యతల పై అవగాహన కల్పించారు.

   ఈ శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ వివరిస్తూ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేసేందుకు మునిసిపాలిటీ , గ్రామీణ ప్రాంతాలను ఎన్యూమరెటర్  బ్లాక్ లుగా విభజించి అందులో 150 కుటుంబాలకు ఒక బ్లాక్ నెంబర్ కేటాయించి ఒక్కో ఎన్యూమరెటర్ కు ఒక్కో బ్లాక్ సర్వే కొరకు బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది.   2011 లో గుర్తించిన బ్లాక్ లను ప్రామాణికంగా తీసుకొని ఎన్యుమరేటర్లు ప్రస్తుతం ఉన్న కుటుంబాల సంఖ్యను గుర్తించాల్సి ఉంటుందన్నారు.  కుటుంబాల సంఖ్యను బట్టి ఎన్యుమరెటర్ బ్లాక్ ల సంఖ్య పెరుగుతుందని వాటి ఆధారంగా ఎన్యుమరేటర్లను కేటాయించడం జరుగుతుంది.  సూపర్వైజర్లు తన ఎన్యుమరెటర్ లకు పూర్తి స్థాయి శిక్షణ ఇవ్వాలని వారికి అణువంత అనుమానం లేకుండా శిక్షణ ఇవ్వాలని సూచించారు. 

75 కాలంలలో సేకరించాల్సి కుటుంబ వివరాలు కొన్ని కోడ్ సంఖ్యలో రాయాల్సి ఉంటుందని, ప్రతి అంశం యొక్క కోడ్ ను స్పష్టంగా అర్ధం చేసుకొని నమోదు చేయాల్సి ఉంటుందని తెలియజేశారు.
అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, అదనపు కలెక్టర్ రెవెన్యూ జి. వెంకటేశ్వర్లు, మాష్టర్ ట్రైనర్లు సి.పి. ఓ భూపాల్ రెడ్డి, జడ్పి సీఈఓ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, తహసిల్దార్ రమేష్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీఓ లు, ఎంపీఓ లు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS