TEJA NEWS

త్రాగుబోతుల వీరంగంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన జర్నలిస్టు
*
వనపర్తి *:
వనపర్తి పట్టణంలో రాత్రి పోల్ జర్నలిస్ట్ పోల్ సురేష్ శెట్టి తన ఇంటి ముందు స్కూటర్ను పార్కింగ్ చేస్తుండగా కాకా 55 హోటల్ మాజీ ఎమ్మెల్యే జయరాములు ఇంటి దగ్గర హోటల్ నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులు తాగిన మైకంలో ఇంటి దగ్గరికి వచ్చి దౌర్జన్యం వీరాంగం చేయుటకు ప్రయత్నించారు . ఇక్కడ స్కూటర్ ఎందుకు పార్కింగ్ చేస్తున్నావు ఎందుకు ఆపుతున్నావు అని దుర్భాషలాడి హంగామా సృష్టించారు మాకు వనపర్తి లో పెట్రోలింగ్ నిర్వహించడానికి పోలీసులు అనుమతిచ్చారని తాగుబోతులు చెప్పారు .నా సొంత ఇల్లు యజమానిని అని చెప్పిన కూడా తాగుబోతులు వినకుండా దౌర్జన్యం చేయడానికి ప్రయత్నించారు. హోటల్లో పని చేసే తాగుబోతులు ఉన్నట్లు తెలిసింది . ఆ సమయంలో నేను నా సెల్ ఫోన్ తీయడానికి ప్రయత్నిస్తే తాగుబోతులు వాహనంపై వెళ్లారు. ఈ సంఘటనపై జిల్లా ఎస్పీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని జర్నలిస్టు పోల్ సురేష్ శెట్టి తెలిపారు ఈ విషయంపై . సామాజికవేత్త శరత్ చంద్ర స్పందిస్తూ ప్రతి హోటల్ దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా హోటల్లో పనిచేసే కార్మికులను త్రాగకుండా పోలీసులు చర్యలు తీసుకొని తాగిన వారిని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయాలని పోలీసుల కు విజ్ఞప్తి చేశారు . వనపర్తి లో రాత్రి పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించి అర్ధ రాత్రి వరకు బిర్యానీ హోటల్స్ నిర్వహిస్తున్న వారిని అదేవిధంగా అన్ని బిర్యాని హోటల్ దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులకు విజ్ఞప్తి చేశారు

Print Friendly, PDF & Email

TEJA NEWS