నామినేషన్ల ప్రక్రియకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలి

నామినేషన్ల ప్రక్రియకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలి

TEJA NEWS

ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వి.పి. గౌతమ్
………

నామినేషన్ల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వి.పి. గౌతమ్ అన్నారు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తో కలిసి నూతన కలెక్టరేట్ కార్యాలయ ఎంట్రెన్స్ గేట్ నుంచి రిటర్నింగ్ అధికారి చాంబర్ వరకు చేయవలసిన భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లోకసభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 25 వరకు జరుగుతుందని, రిటర్నింగ్ అధికారి చాంబర్ ను నూతన కలెక్టరేట్ లో ఏర్పాటు చేయడం జరుగు తుందని అన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని ఆయన తెలిపారు. నామినేషన్ సమయంలో నూతన కలెక్టరేట్ వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఉండేలా చర్యలు తీసుకోవాలని, కలెక్టరేట్ లోని రిటర్నింగ్ అధికారి చాంబర్ నుండి 100 మీటర్ల పరిధిలో ఎన్నికల కమీషన్ మార్గదర్శకాల ప్రకారం బందోబస్తు చర్యలు ఉండాలని రిటర్నింగ్ అధికారి తెలిపారు. ఈ సందర్భంగా ప్రక్రియ అంతా పూర్తి నిఘాతో ఉండేందుకు ఏర్పాటుచేసిన సిసి కెమెరాలను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణా సహాయ కలెక్టర్లు మయాంక్ సింగ్, యువరాజ్, మిర్నల్ శ్రేష్ఠ, అదనపు డిసిపి ప్రసాద రావు, టౌన్ ఏసీపీ రమణ మూర్తి, కలెక్టరేట్ ఎన్నికల సూపరింటెండెంట్ రాంబాబు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS