TEJA NEWS

A woman filed a police complaint against former minister Anil

మాజీ మంత్రి అనిల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ

వైకాపాకు చెందిన మాజీ మంత్రి అనిల్‌పై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన స్థలం కబ్జా చేశారని ఆరోపిస్తూ కౌసర్‌ జాన్‌ చిన్నబజార్‌ సీఐకు ఫిర్యాదు అందజేశారు. నెల్లూరు భగత్‌సింగ్‌ కాలనీలోని తమ స్థలంలో వైకాపా ఆఫీసు కడుతున్నారని అందులో పేర్కొన్నారు. ఈ విషయంలో న్యాయం చేయాలని ఏడాదిగా పోరాటం చేస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. 2002లో తన భర్త కొన్న స్థలంలో 2.8 ఎకరాలు ఆక్రమించారని తెలిపారు. అధికారులు దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.


TEJA NEWS