ACP Uma Maheswara Rao arrested in case of illegal possessions
గతంలో జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో సిఐ గా ఉన్నప్పుడు ఉమామహేశ్వరరావు అమాయక ప్రజలను వేధింపులకు గురిచేసి అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేశాడు. పోలీస్ స్టేషన్లోని పాత కానిస్టేబుళ్లు సహాయంతో భూ అక్రమార్కులతో చేతులు కలిపి అమాయక ప్రజలపై జూటా కేసులు బనాయించి వేధింపులకు గురి చేశాడు.
ఒక మర్డర్ కేస్ ఇన్వెస్టిగేషన్ కోసం వెళ్లిన ఇన్స్పెక్టర్ ఆ ఇంట్లోని మహిళ బెడ్ పై కాలు పెట్టి కూర్చొని మాట్లాడడం అప్పట్లో పత్రికల్లో నిలిచిన వార్త . అలాగే జవహర్ నగర్ ల్యాండ్ మాఫియా వాళ్లతో స్నేహ బంధాలు కొనసాగించాడు. అప్పట్లో ఇతనిపై సీపీ మహేష్ భగవత్ కి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చిన ఇతనిపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు.. ఇతను అబిడ్స్ పోలీస్ స్టేషన్లో పనిచేసినప్పుడు ఇద్దరు మహిళా కానిస్టేబుల్ పై లైంగిక వేధింపులు జరిపారని అప్పట్లో డిజిపి సస్పెండ్ కూడా చేశారు. మహేశ్వరం పోలీస్ స్టేషన్లో కూడా ఇతను ల్యాండ్ సెటిల్మెంట్ లో డబ్బులు తీసుకోవడం సస్పెండ్ అవడం కూడా జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇతని నేర చరిత్ర ఎంత ఉన్నదో ఇప్పుడు ఏసీబీ అధికారులు బట్టబయలు చేశారు…
ఏసీపీ ఉమా మహేశ్వర్ రావు పై అభియోగాలు వచ్చినప్పటికీ ..
ఏసీబీ జాయిన్ డైరెక్టర్ సుధీంద్ర బాబు పలుచోట్ల రైడ్స్ నిర్వహించి..
17 ప్రాపర్టీ లను,5 ఘట్లేస్కార్ ప్లాట్స్ లను,45 లక్షల నగదు,60 తులాల బంగారం సీజ్ చేశారు..
ఇప్పటి వరకు మార్కెట్ విలువ ప్రకారం 3 కోట్ల 45 లక్షలు సొత్తు ను స్వాధీనం చేసుకున్నారు.
బహిరంగ మార్కెట్ లో దీని విలువ రెట్టింపు ఉంటుందని తెలిపారు..
రెండు లాకర్ల ను,
శామీర్ పేట్ లో ఒక విల్లా గుర్తించారు..
ఉమా మహేశ్వర్ రావు ను కోర్టు లో ప్రవేశ పెట్టనున్నారు.