వ్యాదులు ప్రబలకుండా జాగ్రత్తలు చేపట్టండి.
*కమిషనర్ అదితి సింగ్
తిరుపతి నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో చర్చించిన అంశాలను వెంటనే పరిష్కరించాలని మేయర్ డాక్టర్ శిరీష అన్నారు. వర్షాలు కురుస్తున్న వేళ ప్రజలు వ్యాధుల బారిన పడకుండా తగు చర్యలు తీసుకోవాలని కమిషనర్ అదితి సింగ్ అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ వి.సి. హాల్ నందు మేయర్ డాక్టర్ శిరీష
అధ్యక్షతన నగరపాలక సంస్థ కమీషనర్ మరియు అన్ని విభాగముల అధిపతులతో సమీక్ష సమవేశము నిర్వహించారు. ఈ నెల 10 వ తేదీ నిర్వహించబడిన కౌన్సిల్ సాధారణ సమావేశములో ఈ క్రింద కనబరచిన అజెండా అంశము లపైన మరియు కార్పొరేటర్లు తెలియచేసిన సమస్యలపై తీసుకొన్న చర్యల గురించి చర్చించారు.
కౌన్సిల్ సమావేశములో తీసుకున్న తీర్మానములను అమలు పరచుటకు సత్వర చర్యలు తీసుకోవాలని కమీషనర్ , అందరు విభాగపు అధిపతులను మేయర్ ఆదేశిoచినారు.
కార్పొరేటర్లు అందరు వారి వారి వార్డుల నుండి రాబడిన సమస్యలపై అధికారులు తీసుకున్న చర్యలపై వ్రాతపూర్వకముగా సమాధానము ఇవ్వవలెను.
వర్షాల కారణంగా రోడ్లు, పరిశుభ్రత మరియు పారిశుధ్యం పై శ్రద్ధ పెట్టాలి ముఖ్యంగా వర్షాల వల్ల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది ప్రత్యేకించి యాత్రికులు వస్తారు కాబట్టి భక్తులకు , నగర ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలి ప్రజలకు పారిశుధ్యం పై అవగాహన కల్పించడం పై శ్రద్ధ పెట్టాలి. ఈ విషయంలో టిటిడి అధికారుల నుండి సహాకారం తీసుకొవాలి అనుకుంటే తగిన నివేదిక ఇవ్వండి ఎమ్మెల్యే సహకారంతో ఈఓని సంప్రదించి వారి సహాకారం తీసుకుందాము. కూడలి లో రోడ్లు, డ్రైనేజీ దెబ్బ తినే అవకాశం ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షపు నీరు కీలక కూడళ్లలో నిల్వ లేకుండా చూడాలి. తప్పిన ఎడల ప్రమాదాలు జరుగుతాయి. మన నిర్లక్ష్యం ఎక్కడ కనపడకూడదని కోరారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో నూతనముగా నిర్మించిన మాస్టర్ ప్లాన్ రోడ్లలో స్థలమును/గృహములు పోగొట్టుకున్న భూ యజమానులకు జారీ చేయు టి.డి.ఆర్. బాండ్లు విషయమై కార్పొరేటర్లు, ప్రజలు, పత్రికల వారు అనేక సందేహములను వ్యక్త పరచు చున్నారని, వాటిని వెంటనే నివృతి చేయవలెనని, ముఖ్యముగా అర్హులకు టి.డి.ఆర్.బాండ్లు జారీ చేయుటలో టౌన్ ప్లానింగ్ అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోవలెనని కోరినారు. తిరుపతి పార్లమెంటు సభ్యలు మరియు తిరుపతి శాసనసభ్యులు ఆదేశములు మేరకు తిరుపతి నగరపాలక సంస్థ నందు యు.డి.ఎస్. వ్యవస్థను ఆదునీకరించుటకు అంచనాలు వేసి తగు నివేదికలు సమర్పించాలని కోరారు నగరములోని పార్కుల యందు పారిశుధ్య విషయములును మైకుల (ఆడియో) ద్వారా తెలియ చేయవలసినదిగాఆదేశిoచినారు. నగరము నందు రోడ్డు ఇరుప్రక్కల ప్రజల రాక పోకలకు ఆటంకము లేకుండా పార్కింగ్ చేయు వాహనములను పోలీస్ శాఖ వారి ద్వారా తొలగించుటకు తగు చర్యలు తీసుకొవాలని అన్నారు. 27 వ వార్డు సచివాలయము వద్ద రాత్రి వేళల్లో అసాంఘిక కార్యక్రమములు జరుచున్నవని ఫిర్యాదులు వచ్చి నందున అచ్చట పోలీస్ గస్తీని పెంచుటకు తగు చర్యలు తీసుకోవలసినదిగా తెలియచేసినారు.
ఆర్.సి.రోడ్డు నందు బ్రిడ్జి పనిని (కస్తూరిబాయి స్కూల్ వద్ద కలుపుచూ) మరియు ఫుట్ ఓవర్ బ్రిడ్జి (ఆర్.టి.సి. బస్ స్టాండ్ దగ్గర పూజిత రెసిడెన్సి వరకు) పనులు త్వరితగతిన పూర్తి చేయుటకు చర్యలు తీసుకోవలసినదిగా తెలియచేశారు.
డబ్బుల్ డక్కర్ బస్ ను తిరుపతి నగర ప్రజలకు అందుబాటులోకి వచ్చుట కొరకు ఆర్.టి.సి. వారికి అప్పగించు విషయమై ఆర్.టి.సి. యాజమాన్యంతో సమావేశము ఏర్పాటు చేసి తగు చర్య తీసుకోవలసిదిగా తెలియచేశారు. మంచి నీళ్ళ గుంటలోని నీరు కాలుష్యము కాకుండా నివారించుటకు నిపుణుల ద్వారా తగు చర్యలు తీసుకోవలసినదిగా తెలిపినారు. ఈ సమవేశమునకు కమీషనర్ అతిధి సింగ్,అదనపు కమీషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెoడింగ్ ఇంజినీర్ మోహన్, డిప్యూటీ సిటీ ప్లానర్ శ్రీనివాసులురెడ్డి, యo.ఇ-2, వెంకటరామిరెడ్డి, యం.హెచ్.ఓ అన్వేష్, వెటర్నిరీ ఆఫీసర్ నాగేంద్ర,ఆర్.యఫ్.ఓ శ్రీనివాసరావు, సెక్రటరీ రాధిక, మేనేజర్ చిట్టిబాబు, ఆర్.ఓ లు వర్మ, సేతుమాధవ్, శానిటరీ సూపర్ వైజర్లు హాజరైనారు.