TEJA NEWS

విజయవాడ

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్
ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం

మా పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు సర్పంచుల సంఘం నుంచి పార్లమెంట్ కు మరియు శాసనసభకు ఎన్నికైన నాయకులకు శుభాకాంక్షలు – ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వై.వి.బి.రాజేంద్రప్రసాద్.

ఈరోజు విజయవాడలోని బాలోత్సవ భవన్లో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వై.వి.బి.రాజేంద్రప్రసాద్ గారు మరియు ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ ల సంఘ అధ్యక్షురాలు శ్రీమతి వానపల్లి లక్ష్మీ ముత్యాలరావుల ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ గూర్చి చర్చించి, పలు నిర్ణయాలు తీసుకొని తదుపరి ఛాంబర్ నాయకత్వం నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందిన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారిని, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ గారిని సన్మానించిన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ల సంఘం నాయకులు, కార్యకర్తలు.

తదుపరి ఎమ్మెల్యేలు ఇద్దరు కూడ మేము పూజ్యులు, గురువర్యులుగా భావించే వై.వి.బి. రాజేంద్రప్రసాద్ గారు మరియు పంచాయతీరాజ్ ఛాంబర్ , సర్పంచుల సంఘం వల్లనే మేము ఈ స్థాయికి వచ్చామని రాజేంద్రప్రసాద్ గారిని సన్మానించడం జరిగినది.

ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ గారు మాట్లాడుతూ…..

14, 15 వ ఆర్థిక సంఘాల ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని 12,918 గ్రామపంచాయతీలకు పంపించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించి వేసి తన సొంత అవసరాలకు వాడుకుందని, ఆ నిధులు వెంటనే విడుదల చేయాలని మన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం ద్వారాగా ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేసినా గత ప్రభుత్వానికి చీమైనా కుట్టినట్టు లేదని, దాని ఫలితమే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోరపరాజయం పాలవ్వడానికి మన సర్పంచులు,ఎంపీటీసీలు,జడ్పిటిసిలు, ఎంపీపీలు మరియు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ప్రధాన కారణమని రాజేంద్రప్రసాద్ గారు అన్నారు.

అలాగే మన పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు సర్పంచ్ల సంఘం నుంచి ఎంపీగా ఎన్నికైన కలిసెట్టి అప్పలనాయుడు గారికి, అనంతపురం ఎమ్మెల్యేగా ఎన్నికైన దగ్గుపాటి ప్రసాద్ గారికి, శ్రీకాకుళం ఎమ్మెల్యేగా ఎన్నికైన గొండు శంకర్ గారికి మన చాంబర్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని, కష్టపడి నియమ నిబద్ధతతో పనిచేస్తే మంచి ఉన్నత స్థాయికి చేరుకుంటారనేది వీళ్ళను చూసి మిగతా వారందరూ నేర్చుకోవాలని రాజేంద్రప్రసాద్ గారు అన్నారు .

అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు సర్పంచుల సంఘం ద్వారాగా మా అధ్యక్షులు వై వి బి రాజేంద్రప్రసాద్ గారి అడుగుజాడల్లో, నాయకత్వంలో పనిచేసి నేను ఈ స్థాయికి వచ్చానని, ఒక నిబద్దతగల నాయకుడి దగ్గర పనిచేస్తే మనం ఏవిధంగా అభివృద్ధిలోకి వస్తామో నేనే సాక్ష్యం అని, నన్ను ఈ స్థాయికి వచ్చే విధంగా ప్రోత్సహించిన రాజేంద్రప్రసాద్ గారికి కృతజ్ఞున్ని అయి ఉంటానని, అలాగే పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు సర్పంచ్ల సంఘం కు ఎప్పుడు ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా నేను ఎల్లప్పుడూ అండగా ఉంటానని అన్నారు.

శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ గారు మాట్లాడుతూ రాజేంద్రప్రసాద్ గారి నాయకత్వంలో మొదటగా నేను శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులుగా పనిచేస్తున్నానని, నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఎప్పటినుంచో ఉన్న కూడ – ఎమ్మెల్యేగా గెలుపొందడానికి కావలసిన స్ఫూర్తి, ఓర్పు రాజేంద్రప్రసాద్ గారి ద్వారానే నేర్చుకున్నానని, నా ద్వారా గా పంచాయతీ రాజ్ చాంబర్, సర్పంచుల సంఘానికి ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా నేను ముందుంటానని అన్నారు.

నమస్కారాలతో 🙏

బిర్రు ప్రతాప్ రెడ్డి
ప్రధాన కార్యదర్శి – ఆo.ప్ర. పంచాయతి రాజ్ ఛాంబర్.


TEJA NEWS