TEJA NEWS

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్న

చేవెళ్ల :సెప్టెంబర్ 06:చేవేళ్ళ మండలం తంగడపల్లి గ్రామంలో పనిచేస్తున్న టీచర్ కే వెంకటయ్య
ప్రతీ విధ్యార్థి యొక్క భవిష్యత్తుకు జ్ఙానమనే పునాది వేసి వారిని దేశానికి, సమాజానికి ఉపయోగపడే గొప్ప భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పదని చేవేళ్ళ ఎంపి కొండా విశ్వశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో సర్వేపల్లిరాధాక్రిష్ణ జయంతి సందర్భంగా గురుపూజాదినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తమ ఉపాధ్యాయులకు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం – 2024 అవార్డులను ఆయనతో పాటు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్ మరియు జిల్లా విధ్యాశాఖ ఉన్నతాధికారులు సుశిందర్రావు అందించారు. ఈ సంద్భంగా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ టీచర్లు తమ పిల్లల కంటే కూడా విధ్యార్థుల భవిష్యత్తు పట్ట చాలా శ్రద్ధ వహిస్తారని కొనియాడారు. ప్రతీ విధ్యార్థి సర్వేపల్లి రాధాక్రిష్ట వంటి గొప్ప ఉపాధ్యయుని లా తయారయ్యేలా ఉపాధ్యాయులు పని చేయాలన్నారు. ఈ సందర్భంగా కొత్తపల్లి ఖానాపూర్ పాఠశాలలో తన సేవలను అందించి ప్రస్తుతం చేవేళ్ళ మండలం తంగడపల్లి లో పని చేస్తూ అవార్డును అందుకున్న కే వెంకటయ్య టీచర్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఉపాధ్యయ సంఘాల ప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు మరియు తంగడపల్లి పాఠశాల ఉపాధ్యాయులు అనసూయ రామచంద్రయ్య ప్రత్యూష తలారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్ రాములు మాణిక్యం పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS