
ఇసుక అక్రమ రవాణా ఇక బంద్ *
మహబూబాబాద్ జిల్లా ఎస్.పి సుధీర్ రాంనాథ్ కేకన్, ఐ.పీ.ఎస్ ఆదేశాల మేరకు నేటి నుండి ఇసుక అక్రమ రవాణా పై కఠిన చర్యలు చేపట్టడం జరుగుతుంది.
- మరిపెడ, సీరోలు, చిన్నగూడూర్ మండలాల్లో ఇప్పటివరకు ఇసుక రవాణా కోసం ఎలాంటి అనుమతులు లేవు.
- ఎవరైనా ఇసుక రవాణా చేస్తే కఠిన మయిన సెక్షన్స్ కింద (PDPP ACT, MINES ACT) కేసులు పెట్టడం జరుగుతుంది.
- అన్ని ఇసుక ర్యాంప్ ల వద్ద ట్రెంచ్ లు తీసాము.
- ఇసుక ట్రాక్టర్ ను సీజ్ చేసి కోర్టు లో డిపాజిట్ చేస్తాము.
- గతం లో ఇట్టి ఇసుక అక్రమ రవాణా కేసులు ఉన్న వారి పైన, ఇప్పుడు ఇంకా కఠిన చర్యలు తీసుకో బడతాయి.
ప్రజలు సహకరించగలరు.
ఇట్లు
రాజ్ కుమార్ గౌడ్
సీ. ఐ., మరిపెడ
