ఎల్వెర్తి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
శంకర్‌పల్లి: శంకర్‌పల్లి మండల ఎల్వర్తి ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరిగాయి. ప్రధానోపాధ్యాయురాలు శాంతి బతుకమ్మ సంబరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దం బతుకమ్మ సంబరాలు అని అన్నారు. బతుకునిచ్చే అమ్మ బతుకమ్మ అని కొనియాడారు. తీరొక్క పూలతో బతుకమ్మలను మహిళలు అలంకరించి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు. కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ సత్యనారాయణ, ఉపాధ్యాయురాలు పద్మ, జీవన్, రఫీ, విజయలక్ష్మి పాల్గొన్నారు.