తాడేపల్లి
ఉండవల్లి సెంటర్ లో వై.ఎస్.ఆర్. విగ్రహానికి పాలభిషేకం నిర్వహించిన వైసీపీ నాయకులు
యాత్ర 2 సినిమా విడుదల సందర్బంగా వైసీపీ తాడేపల్లి పట్టణ
అధ్యక్షులు బుర్రముక్కు వేణుగోపాల స్వామి రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.యాత్ర 2″ సినిమాను తిలకిచేందుకు భారీగా వైసీపీ నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లారు.ముందుగా బైక్ ర్యాలీ ని వేణుగోపాల స్వామి రెడ్డి
ప్రారంభించారు.అనంతరం ఉండవల్లి సెంటర్ రామకృష్ణ థియేటర్ వద్ద కు చేరుకొని వై.ఎస్.ఆర్.విగ్రహానికి పాలభిషేకం నిర్వహించారు.ఈ సందర్బంగా వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిఈదులముడి డేవిడ్ రాజు మాట్లాడుతూ వై.ఎస్.
రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రలతో కూడిన చిత్రాన్ని వైయస్సార్ అభిమానులు జగన్ అభిమానులు ప్రతి ఒక్కరు చూడాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ
గుంటూరు జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ మేకా వెంకటరామిరెడ్డి, తాడేపల్లి పట్టణ ఎస్సీ, ఎస్టీ,బీసీ, మహిళ సేవాదళ్ యూత్ అధ్యక్షులు ముదిగొండ ప్రకాష్, బాలసాని అనిల్,బత్తుల దాసు, సంపూర్ణ పార్వతి, కురుబుర రమేష్,గుంటూరు జిల్లా ఎస్టి సెల్ అధ్యక్షులు మేడ వెంకటేశ్వరావు, పార్టీ నాయకులు కార్యకర్తలు
పాల్గొన్నారు.