TEJA NEWS

భారీ వర్షాదారానికి కొట్టుకుపోయిన బ్రిడ్జ్

  • అప్రమత్తమైన అధికారులు, మరమ్మత్తులు చేయాలని పలు సూచనలు – ఎంపీడీవో గుండె బాబు

కమలాపూర్

కమలాపూర్ మండల పరధిలో గునిపర్తి గ్రామం నుండి పరకాల వెళ్లే మార్గంలో కంఠాత్మకూరు వాగు పై గల కల్వర్టు కొట్టుకపోవడం జరిగింది. మండల పరిషత్ అభివృద్ధి అధికారి గుండె బాబు గునిపర్తి నుండి కంటాత్మకూర్ వెళ్లే మార్గాన్ని పరిశీలించడం జరిగింది.ఈ కారణంగాఎంపీడీవో గుండె బాబు మాట్లాడుతూ గునిపర్తి నుండి పరకాల వెళ్లే వాహనాలన్నిటిని వయా మాదన్నపేట, శనిగరం గ్రామాల నుండి వెళ్లే విధంగా చూడాలని గ్రామ కార్యదర్శిని ఆదేశించడం జరిగింది.
ఈ సందర్భంగా గునిపర్తి మరియు మాదన్నపేట పంచాయతీ కార్యదర్శులను అప్రమత్తం చేసి ఈ బ్రిడ్జి నుండి ఎలాంటి వాహనలు కూడా వెళ్లకుండా ఉండే విధంగా నిరంతరము పరిశీలించాలని సూచించడం జరిగింది. చేపలు పట్టడానికి కూడా ఎవరిని కూడా అనుమతించకూడదని సూచించడం జరిగింది. వాతావరణ శాఖ హెచ్చరిక మేరకు ఇంకా రెండు రోజులు విపరీతంగా వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో మండలంలోని పంచాయతీ కార్యదర్శులు అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది.
గ్రామాలలో కూలిపోవుటకు సిద్ధంగా ఉన్న ఇండ్లలో నివసించే వారికి పాఠశాలలు, రైతు వేదికలు మొదలైన ప్రభుత్వ భవనాలలో ఆశ్రయం కల్పించాలని ఆదేశించడం జరిగింది. పంచాయతీ కార్యదర్శులు అందరూ గ్రామాలలో అందుబాటులో ఉండి రోడ్లు, చెరువులు గండి పడిన వెంటనే వాటిని ఆయా శాఖల అధికారులకు తెలిపి మరమ్మత్తులు చేయించటకు సిద్ధంగా ఉండాలని చెప్పడం జరిగింది.
మండలంలోని ప్రజలెవరు కూడా అత్యవసర పరిస్థితిలో తప్ప బయటకి వెళ్ళరాదని , ఏవైనా పనులు ఉంటే వాయిదా వేసుకోవాలని, ఎట్టి పరిస్థితుల విద్యుత్ స్తంభాలను ముట్టుకోకూడదని, పిడుగులు పడే అవకాశం ఉన్న కారణంగా రైతులు, రైతు కూలీలు, వాహనదారులు మరియు ప్రజలు చెట్ల కింద ఉండరాదని సూచించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి ఉన్నతాధికారులు మరియు గ్రామ సిబ్బంది పాల్గొన్నారు


TEJA NEWS