నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో బాచుపల్లి 20వ డివిజన్ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రంగరాయ ప్రసాద్ , కార్పొరేటర్ బాలాజీ నాయక్ తో కలిసి ఇంటి ఇంటికి ప్రచారం నిర్వహించారు..
హిల్ కౌంటీ లో ఇంటింటికి తిరుగుతూ బిఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ని గెలిపించాలని ప్రచారం నిర్వహించారు…
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్కాజ్గిరి బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి అఖండ మెజార్టీతో విజయం సాధిస్తారని.. బిఆర్ఎస్ పార్టీ పట్ల మన నాయకుడు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారని… కాంగ్రెస్ వైఫల్యాలను, 420 హామీలతో ప్రజలను వంచించిన విషయాలను వారికి అర్థమయ్యేలా వివరిస్తూ కారు గుర్తుకే ఓటు వేసి లక్ష్మారెడ్డి ని గెలిపించాలని ఆమె కోరారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు,నాయకులు,మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.